Sita Ramam Glimpse : యుద్ధంలో ‘సీత రామం’ ప్రేమకథ.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
వెండితెరపై మర్చిపోలేని ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడుగా హను రాఘవపూడి( Hanu Raghavapudi)కి మంచి పేరుంది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హను రాఘవపూడి
వెండితెరపై మర్చిపోలేని ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడుగా హను రాఘవపూడి( Hanu Raghavapudi)కి మంచి పేరుంది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హను రాఘవపూడి. ఆ తర్వాత అందమైన ప్రేమకథలను తెరకెక్కించారు. తాజాగా ఆయన దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan )కథానాయకుడి యుద్ధం నేపధ్యంలో అందమైన ప్రేమకథ చిత్రం రూపొందుతుంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రానికి ‘సీతా రామం” అనే టైటిల్ ని ఖారారు చేశారు.’ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథ” అనేది ఉపశీర్షిక. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పంచుకున్న టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. టైటిల్ గ్లింప్స్ లో ”ఇది ఓ సైనికుడు శత్రుకి అప్పగించిన యుద్దం ఆఫ్రీన్. ఈ యుద్ధంలో సీతారాములని నువ్వే గెలిపించాలి’ అనే డైలాగ్ టైటిల్ తగ్గట్టు అద్భుతంగా వుంది. ఈ డైలాగ్ తర్వాత ఆఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న రివిల్ కావడం, తర్వాత సీత పాత్రలో హీరోయిన్ మృణాళిని, రాముడి పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించడం ఆసక్తికరంగా వుంది. యుద్ధం నేపధ్యంలో సాగే ఈ ప్రేమ కథలో లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. టైటిల్ వీడియోలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్, రష్మిక మందన్న అద్భుతంగా కనిపించారు. ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా విజువల్ ట్రీట్ గా వుండబోతుందని అర్ధమౌతుంది. వెటరన్ సినిమాటోగ్రఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో వున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది.