AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Naresh: ‘మారేడుమిల్లి ప్రజానీకం’కు అండగా నరేష్.. మరో వైవిధ్యమైన కథతో రానున్న అల్లరోడు

కామెడీ చిత్రాల‌తో క‌డుపుబ్బా న‌వ్వించిన నేటి త‌రం కామెడీ స్టార్ అల్ల‌రి నరేష్‌(Allari Naresh). కామెడీ చిత్రాలే కాదు..నేను, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గమ్యం, నాంది వంటి వైవిధ్య‌మైన..

Allari Naresh: 'మారేడుమిల్లి ప్రజానీకం'కు అండగా నరేష్.. మరో వైవిధ్యమైన కథతో రానున్న అల్లరోడు
Allari Naresh
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2022 | 5:56 PM

Share

కామెడీ చిత్రాల‌తో క‌డుపుబ్బా న‌వ్వించిన నేటి త‌రం కామెడీ స్టార్ అల్ల‌రి నరేష్‌(Allari Naresh). కామెడీ చిత్రాలే కాదు..నేను, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గమ్యం, నాంది వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లోనూ న‌టించి న‌టుడిగా మెప్పించారాయ‌న‌. తాజాగా అల్లరి నరేష్ నటిస్తున్న 59వ చిత్రంను అనౌన్స్ చేశారు. సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, రిప‌బ్లిక్‌, బంగార్రాజు వంటి వ‌రుస స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో, మ‌రో నిర్మాణ‌ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండు, బాలాజీ గుత్త నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ కు  జోడీగా ఆనంది న‌టిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. టైటిల్‌ను గ‌మ‌నిస్తే.. చుట్టు అడ‌వి మ‌ధ్య‌లో కొంద‌రు గ్రామ‌స్థులు పిల్ల‌ల‌తో స‌హా నిలుచుని ఉన్నారు. వారి ముందు ఓ యువ‌కుడు బ‌ల్లెం ప‌ట్టుకుని ధైర్యంగా నిల‌బ‌డి ఉన్నారు. అంద‌రి ముందున్న చెరువులో వారి ప్ర‌తిరూపాలు క‌నిపిస్తున్నాయి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌ల‌ను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

Naresh

Naresh

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్