కనీసం మర్యాద కూడా ఇవ్వరూ.. బాలీవుడ్ పై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ పై చాలా కామెంట్స్.. చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీ పై విమర్శలు కురిపించారు. తాజాగా ఓ స్టార్ హీరో బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి.. స్టార్ హీరో అవ్వకపోతే కనీసం మరియా కూడా ఇవ్వరు అని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ పై ఇప్పటికే చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. చాలా మంది బాలీవుడ్ పై రకరకాల విమర్శలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కామెంట్స్ చేశారు. అలాగే అక్కడి రాజకీయం పై కూడా కొంతమంది విమర్శలు చేశారు. తాజాగా ఓ స్టార్ హీరో బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టార్ హీరో క్రేజ్ లేకపోతే కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు అని చెప్పుకొచ్చాడు ఆ స్టార్ హీరో.. సౌత్ లో స్టార్ హీరో అయిన ఆయన బాలీవుడ్ లోనూ ఒకటి రెండు సినిమాలు చేశాడు. కానీ ఇక్కడి అక్కడికి చాలా తేడా ఉందని తెలిపాడు ఆ స్టార్ హీరో.. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.?
సౌత్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. మలయాళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. ఆయన నటించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అలాగే మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్, రీసెంట్ గా వచ్చిన కాంత సినిమాలతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాదు నిర్మాతగానూ రాణిస్తున్నాడు దుల్కర్. ఇదిలా ఉంటే తాజాగా దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
బాలీవుడ్ లో నటించే సమయంలో నా చుట్టూ కొంతమంది మనుషులు ఉంటారు. ఎప్పుడూ నన్ను రౌండప్ చేసి ఉంటారు. ఎందుకంటే నాకు స్టార్ డమ్ ఉంది అని నమ్మించడానికి.. స్టార్ హీరో క్రేజ్ లేకపోతే అక్కడ మర్యాద కూడా ఇవ్వరు. కనీసం కుర్చీ కూడా వేయరు. చుట్టూ జనాలు.. లగ్జరీ కారు ఉంటేనే మనల్ని స్టార్ అనుకుంటారు. కానీ మా దగ్గర అలా ఉండదు.. మలయాళ ఇండస్ట్రీలో సెట్ కు ఎలా వచ్చినా కూడా గౌరవిస్తారు. మనకు కావాల్సినవన్నీ ఇంటిదగ్గర నుంచే తెచ్చుకుంటాం.. ఎక్కువ వరకు సొంత ఖర్చులే పెట్టుకుంటాం.. కానీ బాలీవుడ్ లో అలా ఉండదు. అదేవిధంగా లగ్జరీ కారులోనే సెట్ కు రావాలి అని చెప్పుకొచ్చాడు దుల్కర్. ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .








