Dulquer Salmaan: ‘బాలీవుడ్ స్టార్ హీరో చూసేందుకు అతని కారు వెంట పరిగెత్తాను’.. ఆసక్తికర విషయాలు చెప్పిన సీతారామం హీరో..

ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దుల్కర్ సల్మాన్.. తాను

Dulquer Salmaan: 'బాలీవుడ్ స్టార్ హీరో చూసేందుకు అతని కారు వెంట పరిగెత్తాను'.. ఆసక్తికర విషయాలు చెప్పిన సీతారామం హీరో..
Dulquer Salmaan
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 27, 2022 | 10:02 AM

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సీతారామం సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ఈ హీరో. డైరెక్టర్ హానురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్.. మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులనే కాదు.. నార్త్ ఆడియన్స్‏ను సైతం ఆకట్టుకుంది. ఇక ఇటీవలే చుప్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దుల్కర్ సల్మాన్.. తాను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వీరాభిమానని తెలిపారు. తాను టీనేజ్‏లో ఉన్న సమయంలో స్నేహితులతో కలిసి సల్మాన్ కారు వెంట పరిగెత్తామని తెలిపారు. తన అభిమాన నటుడు సల్మాన్ ఖాన్‏ను ఇప్పటివరకు కలవలేదు అని చెప్పుకొచ్చారు.

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన చుపు.. ది రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ” నేను స్నేహితులతో కలిసి ఆలివ్ కు వెళ్లాను. మేము చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేశాము. అదే సమయంలో సల్మాన్ ఖాన్ వెళ్లడం గమనించాము. దీంతో అతని కారు వెంటపరిగెత్తాము. సల్మాన్ ఖాన్ కారు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడా ? అని ఎదురుచూశాము. అనీ అతను రాలేదు. ఇప్పటివరకు నేను సల్మాన్ ఖాన్‏ను నేరుగా కలవలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. చుప్ చిత్రంలో సన్నీ డియోల్, పూజా భట్, శ్రేయ ధన్వంతరి కీలకపాత్రలలో నటించారు.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ