Aishwarya Rajesh: లేడీ ఆటోడ్రైవర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్.. వైరలవుతోన్న ఫొటోలు
ఐశ్వర్య నటించిన మరో మహిళా ప్రాధాన్య చిత్రం 'డ్రైవర్ జమున'. ఇందులో లేడీ ఆటో డ్రైవర్ పాత్రలో నటించింది ఐశ్వర్య. కింగ్స్‌లిన్ దర్శకత్వం వహించారు. 18 ప్రిన్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 30) విడుదలైంది.
దక్షిణాదిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోన్న కథానాయికల జాబితాలో ఐశ్వర్యా రాజేష్ కూడా ఒకరు. ఓవైపు హీరోయిన్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోందీ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్. తాజాగా ఐశ్వర్య నటించిన మరో మహిళా ప్రాధాన్య చిత్రం ‘డ్రైవర్ జమున’. ఇందులో లేడీ ఆటో డ్రైవర్ పాత్రలో నటించింది ఐశ్వర్య. కింగ్స్‌లిన్ దర్శకత్వం వహించారు. 18 ప్రిన్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 30) విడుదలైంది. కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా మూవీ యూనిట్ మహిళా ఆటో డ్రైవర్లతో సమావేశమైంది. ఈ కార్యక్రమానికి చెన్నైతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మొత్తం 40 మందికి పైగా మహిళా ఆటో డ్రైవర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రైవర్ జమున సినిమాలో ఆటో డ్రైవర్ ఐశ్వర్య రాజేష్ రియల్ మహిళా ఆటో డ్రైవర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా లేడీ ఆటోడ్రైవర్లతో ముచ్చటించిన ఐశ్వర్య వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.
కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ ఆటో డ్రైవర్లలో ఒకరిని ఎంపిక చేసిన చిత్ర యూనిట్ ఆమెకు కొత్త ఆటోను బహుమతిగా అందించారు. దీని తాళం చెవిని ఆ మహిళా ఆటో డ్రైవర్‌కు నటి ఐశ్వర్యా రాజేష్ చేతుల మీదుగా అందించి ఆశ్చర్య పరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. డ్రైవర్ జమున మూవీ యూనిట్ చేసిన మంచి పనిని ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా సినిమాలతో పాటు సుజల్ లాంటి వెబ్‌సిరీసుల్లోనూ నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో దూసుకెళుతోంది ఐశ్వర్య. ప్రస్తుతం ఆమె చేతిలో పదికి పైగా సినిమాలు ఉండడం ఆమె క్రేజ్‌కు నిదర్శనం. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా గడుపుతోందీ ట్యాలెంటెడ్ హీరోయిన్.
The team of #DriverJamuna screened the movie in a special premiere for female cab drivers to show their respect and admiration for them ✨
Here’s how it went!
Watch Driver Jamuna in cinemas near you #DriverJamunaFromToday Blockbuster Driver Jamuna @aishu_dil @kinslin pic.twitter.com/gpmDywETnf
— SP Chowthari (@SPChowdhary3) December 30, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..