AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య పాటలో చిరు వేసిన షర్ట్‏ రామ్ చరణ్ దా ?.. తనయుడి డ్రెస్‏లో మెగాస్టార్ స్టెప్పులు..

వాల్తేరు వీరయ్య సినిమాలోని 'పూనకాలు లోడింగ్' పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాట

Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య పాటలో చిరు వేసిన షర్ట్‏ రామ్ చరణ్ దా ?.. తనయుడి డ్రెస్‏లో మెగాస్టార్ స్టెప్పులు..
Megastar Chiranjeevi, Ram C
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2022 | 10:55 AM

Share

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల సినిమా వాల్తేరు వీరయ్య. డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఇందులోని పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని ‘పూనకాలు లోడింగ్’ పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ”డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్” అనడం పూనకాలని రెట్టింపు చేసింది.

అయితే ఈ పాటలో చిరు వేసి షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో చిరు ఎరుపు రంగు పూల చొక్కా ధరించి మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఆ షర్ట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా ఓ సంబంధం ఉంది. చెర్రీ కూడా అచ్చం అలాంటి షర్ట్ నే ధరించి ఓ యాడ్ లో కనిపించాడు. దాంతో చిరు వేసిన షర్ట్ తనయుడు చెర్రీది అంటూ నెట్టింట షేర్ చేస్తున్నారు. అలాగే ఒకేలాంటి డిజైన్ ఉన్న షర్ట్ లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

అయితే మరోవైపు పూనకాలు లోడింగ్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా ఉందుంటున్నారు అభిమానులు.. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్‌ అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. చిరంజీవి మాస్‌ లుక్, గెటప్.. ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్‌బస్టర్స్ ని గుర్తుకుతెస్తుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఇలా తెలుసుకోండి..
తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా..? లేదా..? ఇలా తెలుసుకోండి..