Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranya Rao: రన్య రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విస్తుపోయే విషయాలు.. స్విట్జర్లాండ్‌ వెళ్తున్నానని చెప్పి చివరకు..

దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా బంగారాన్ని తీసుకువచ్చారనే ఆరోపణలపై నటి రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి రన్యా రావు బంగారాన్ని కొనుగోలు చేసిందని.. ఆ తర్వాత యూట్యూబ్‌లో చూసిన వీడియోలను చూపించి, ఆ బంగారాన్ని తన శరీరంపై అతికించి బెంగళూరుకు తీసుకువచ్చిందని దర్యాప్తులో తేలింది.

Ranya Rao: రన్య రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విస్తుపోయే విషయాలు.. స్విట్జర్లాండ్‌ వెళ్తున్నానని చెప్పి చివరకు..
Ranya Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 15, 2025 | 2:06 PM

బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై కన్నడ నటి రన్యరావును అరెస్ట్ చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( DRI ) .. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆమెకు బంగారం ఎవరు ఇచ్చారు….? దుబాయ్ నుంచి బెంగుళూరుకు అక్రమంగా బంగారాన్ని ఎలా తీసుకువచ్చారనే కోణంలో డీఆరఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నటి రన్యా రావు స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు వెళ్తున్నానని చెప్పి.. దుబాయ్ నుంచి బెంగుళూరుకు అక్రమంగా బంగారాన్ని తీసుకువచ్చినట్లు డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. రన్యా రావు డిసెంబర్ 13, 20, 2024 తేదీలలో రెండుసార్లు విడివిడిగా కోటి రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. తరువాత, బంగారాన్ని రవాణా చేస్తుండగా అక్కడి విమానాశ్రయ అధికారులకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు వెళ్తున్నామని అబద్ధం చెప్పి బెంగళూరు చేరుకున్నారు.

నటి రన్యా రావు దుబాయ్ విమానాశ్రయంలో భద్రతా అధికారుల దృష్టి నుండి తప్పించుకున్నట్లు DRI వెల్లడించింది. రన్య రావుకు బంగారం ఇచ్చిన వ్యక్తి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు, మంచి శరీరం, ఆఫ్రికన్-అమెరికన్ యాస, గోధుమ రంగు కలిగి ఉన్నాడని సమాచారం. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 గేట్ ‘ఎ’ వద్ద ఉన్న డైనింగ్ రూమ్‌లోని ఎస్ప్రెస్సో మెషిన్ దగ్గర ఆ వ్యక్తిని కలిశానని.. ఈ సమావేశానికి ముందు, అతను ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసి, ఎక్కడ కలవాలో చెప్పాడని రన్య రావు తెలిపింది. నటి రన్యా రావు కూడా గుర్తింపు కోసం తెల్లటి కాండ్రా (సాంప్రదాయ అరబ్ వస్త్రం) ధరించి ఉన్నానని చెప్పినట్లు DRI అధికారులకు చెప్పుకొచ్చింది. అతడు తనకు టార్పాలిన్ వంటి వస్త్రంలో చుట్టిన రెండు ప్యాకెట్స్ ఇచ్చాడని.. ఆ తర్వాత వాటిని తీసుకుని డైనింగ్ రూమ్ దగ్గర ఉన్న టాయిలెట్ కి వెళ్లి ఒక ప్యాకెట్ తెరిచినప్పుడు, అందులో నాలుగు సెట్లలో ప్యాక్ చేయబడిన 12 బంగారు కడ్డీలు ఉన్నాయని.. మరో ప్యాక్‌లో ఐదు కట్ చేసిన బంగారు ముక్కలు ఒకదానితో ఒకటి కట్టి ఉన్నాయని రన్య రావు విచారణలో వెల్లడించింది. ఆ వ్యక్తిని తాను అంతకు ముందు లేదా ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదని నటి పేర్కొంది.

యూట్యూబ్ చూసి బంగారాన్ని శరీరానికి ఎలా అతికించుకోవాలో తెలుసుకున్నానని.. టెర్మినల్ లోకి ప్రవేశించే ముందు, విమానాశ్రయం నుండి ఒక కి.మీ దూరంలో ఉన్న ఒక స్టేషనరీ దుకాణం నుండి కొన్ని గమ్ టేప్ తీసుకున్నానని.. విమానాశ్రయ నిబంధనల ప్రకారమే కనిపించకుండా టేప్ ద్వారా బంగారాన్ని అతికించుకున్నట్లు తెలిపింది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

మద్యం మత్తులో రెచ్చిపోయిన తాగుబోతులు..!
మద్యం మత్తులో రెచ్చిపోయిన తాగుబోతులు..!
డార్లింగ్.. షారుఖ్.. బన్నీ.. ఎవరు అసలైన పాన్ ఇండియా కింగ్.?
డార్లింగ్.. షారుఖ్.. బన్నీ.. ఎవరు అసలైన పాన్ ఇండియా కింగ్.?
ఒంట్లో కొవ్వు తగ్గడం లేదా.? కొబ్బరినీళ్లతో కూడా బరువు తగ్గొచ్చు.!
ఒంట్లో కొవ్వు తగ్గడం లేదా.? కొబ్బరినీళ్లతో కూడా బరువు తగ్గొచ్చు.!
ఈ విదేశీ కంపెనీ కార్లపై బంపర్ సేల్.. రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్‌
ఈ విదేశీ కంపెనీ కార్లపై బంపర్ సేల్.. రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్‌
అసెంబ్లీలో గళం విప్పండి: బీజేపీ ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి
అసెంబ్లీలో గళం విప్పండి: బీజేపీ ఎమ్మెల్యేలతో కిషన్‌రెడ్డి
నెల రోజులపాటు ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే ఏమౌతుందో తెలుసా.?
నెల రోజులపాటు ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే ఏమౌతుందో తెలుసా.?
వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. ఇక మరింత సులభం!
వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. ఇక మరింత సులభం!
పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తాజా రేట్లు ఇవే..
పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తాజా రేట్లు ఇవే..
ఆపిల్ నుంచి అత్యంత సన్నని ఫోన్..లాంచ్ తేదీ, ఫీచర్స్‌ ఏంటో తెలుసా?
ఆపిల్ నుంచి అత్యంత సన్నని ఫోన్..లాంచ్ తేదీ, ఫీచర్స్‌ ఏంటో తెలుసా?
Weekly Horoscope: వారికి అన్ని ప్రయత్నాల్లోనూ విజయమే..
Weekly Horoscope: వారికి అన్ని ప్రయత్నాల్లోనూ విజయమే..