AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరినాయనో..! స్టార్ హీరోయిన్స్‌కు గట్టిపోటీ.. వనిత విజయ్ కుమార్ కూతుర్ని చూశారా..

తమిళ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైందీ అందాల తార. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే సినిమా విషయాల కంటే తన వ్యక్తి గత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిందామె.

ఓరినాయనో..! స్టార్ హీరోయిన్స్‌కు గట్టిపోటీ.. వనిత విజయ్ కుమార్ కూతుర్ని చూశారా..
Vanitha Vijayakumar
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2025 | 2:31 PM

Share

ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటీమణుల్లో వనిత విజయ్ కుమార్ ఒకరు. సినిమాతో చాలా మంది పాపులర్ అవుతుంటే ఈ అమ్మడు మాత్రం వ్యక్తిగత విషయాలతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది వనిత విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకున్నారు విజయ్ కుమార్. ఇక వనిత విషయానికొస్తే తమిళంలో విడుదలైన ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. అలాగే తెలుగులో దేవి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె చేసిన సినిమాలు తక్కువే కానీ ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేస్తూ ఉంటుంది. ఆ వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. తెలుగులో దేవి సినిమా తర్వాత తిరిగి చివరిగా సీనియర్ నరేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నటించింది వనితా. కాగా ఇక ఈ అమ్మడి వ్యక్తిగత విషయానికొస్తే.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఈ మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. అలాగే స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతోనూ ఆమె వివాదం పెట్టుకుంది. వీటితో పాటు చాలా కాంట్రవర్షల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

2000 సంవత్సరంలో హీరో ఆకాష్‌ను తొలిసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆనంద్‌ అనే బిజినెస్ మెన్‌ను రెండో పెళ్లి చేసుకుంది వనిత. ఈ ఇద్దరికీ జయనిత్ అనే కొడుకు పుట్టాడు. పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది అతనితో కూడా విడిపోయింది. అయితే ఇప్పుడు వనిత విజయ్ కుమార్ కూతురు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ చిన్నది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెను చూసి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీని పై వనిత విజయ్ కుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కుమార్తె జోవిక ను సినిమాల్లో పరిచయం చేయడం కోసం ఎదురుచూస్తున్నా.. ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.

View this post on Instagram

A post shared by Vanitha (@vanithavijaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం..
ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం..
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..