Actress : పెద్దింటి కోడలు.. 12 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. 34 ఏళ్లకే మరణం.. ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో..

ఒకప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఓ వెలుగు వెలిగారు. అందం, అంతకుమించి సహజమైన నటనతో అడియన్స్ మనసులు దొచుకున్నారు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం 12 ఏళ్లకే అరంగేట్రం చేశారు.

Actress : పెద్దింటి కోడలు.. 12 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. 34 ఏళ్లకే మరణం.. ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో..
Geeta Bali

Updated on: Sep 27, 2025 | 1:00 PM

1940, 50లలో సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే నటనపై ఆసక్తితో కాదు..కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం.. కుటుంబానికి అండగా నిలబడేందుకు కొందరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె పేరు గీతా బాలి. 12 సంవత్సరాల వయసులోనే కొరియోగ్రాఫర్ పండిట్ జియాన్ శంకర్ రూపొందించిన ‘ది గాబ్లర్’ అనే డాక్యుమెంటరీ చిత్రం నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశారు. ఆ త్రవాత కేదార్ శర్మ చిత్రం సోహాక్ రాత్ మూవీతో ఆమె కథానాయికగా మారారు. ఈ సినిమాతో ఆమె స్టార్ డమ్ సంపాదించుకుంది. తర్వాత ఆమెకు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

గీత బాలి ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి గోల్డెన్ టెంపుల్ లో భజన గాయకుడిగా పనిచేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె నటనపై ఆసక్తి పెంచుకుంది. 12 ఏళ్ల వయసులోనే ఆమె ఆల్ ఇండియా రేడియోలో గాయనిగా పనిచేశారు. ఆ తర్వాత ముంబై వెళ్లిన ఆమె.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. 1948లో కేదార్ శర్మ దర్శకత్వం వహించిన ‘సోహక్ రాత్’ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నటుడు షమ్మీ కపూర్ ను వివాహం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. గీతా బాలి 34 సంవత్సరాల వయసులో మీజిల్స్‌తో మరణించారు. అతి తక్కువ కాలంలోనే 70 కి పైగా చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గీత బాలి.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..

Geeta Bali News

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..