Tollywood: వందలాది సినిమాల్లో నటించి నవ్వించిన ఈ టాలీవుడ్ యాక్టర్ గుర్తున్నాడా? ఆయన అల్లుడు ఫేమస్ క్రికెటర్

నువ్వే కావాలి సినిమాలో శంకర్ మేల్కోటే నటన హైలెట్ గా నిలిచింది. కోవై సరళతో కలిసి ఆయన చేసిన కామెడీకి ఆడియెన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇక మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలోనూ శంకర్ మేల్కోటే ట్రేడ్ మార్క్ డైలాగ్ 'నేను నమ్మను' బాగా ఫేమస్ అయ్యింది.

Tollywood: వందలాది సినిమాల్లో నటించి నవ్వించిన ఈ టాలీవుడ్ యాక్టర్ గుర్తున్నాడా? ఆయన అల్లుడు ఫేమస్ క్రికెటర్
Shankar Melkote

Updated on: Nov 20, 2025 | 9:37 PM

శంకర్ మెల్కోటే.. పేరు చెబితే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ ఆయన ఫేస్ చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఓహో ఈయనా? అని అంటారు. ఇప్పటి తరానికి ఈ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ.. 90స్ కిడ్స్‌ శంకర్ మేల్కోటే అన్నా, ఆయన సినిమాలన్నా బాగా ఇష్టపడతారు. దిగ్గజ దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శంకర్ మెల్కోటే. ఆ తర్వాత కారు దిద్దిన కాపురం, ప్రేమాయణం, అశ్వినీ, శ్రీమన్ బ్రహ్మాచారి, నువ్వే కావాలి, ఆనంద, ఆకాశ వీధిలో, నువ్వు నాకు నచ్చావ్, సంతోషం, మన్మథుడు, ఒక రాజు ఒక రాణి, దొంగ రాముడు అండ్ పార్టీ, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, నేను, బాలు, దేశ ముదురు, ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే, లక్ష్యం, అతిథి, అనసూయ, యోగి, బ్లేడ్ బాబ్జీ, పవర్, కార్తికేయ, జాంబిరెడ్డి..ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మేల్కోటే. కన్నడ, తమిళ్, హిందీ భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారీ సీనియర్ నటుడు. తన సినిమాల్లో ఎక్కువగా బాస్ పాత్రల్లోనే కనిపించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు మేల్కొటే. ఇక మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో బ్రహ్మనందంతో మేల్కొటే చెప్పిన ‘నేను నమ్మను’ డైలాగ్ బాగా ఫేమస్ అయిపోయింది.

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 180 కు పైగా సినిమాల్లో నటించారు శంకర్ మేల్కొటే. సినిమాలతో పాటు కొన్ని సీరియల్స్ లోనూ నటించారాయన. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ కు చేరువయ్యారు. అయితే ప్రస్తుతం మేల్కొటే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఓ ప్రముఖ కంపెనీలో కీలక పదవిలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే శంకర్ మేల్కొటే అల్లుడు ఫేమస్ అని క్రికెటర్ అని చాలా మందికి తెలియదు. హైదరాబాద్ మాజీ రంజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్‌ ఎంపీ శ్రీధర్ మేల్కొటే కూతురు రమాని శ్రీధర్ వివాహం చేసుకున్నారు. ఎం.వి. శ్రీధర్ టీమిండియా మేనేజర్‌గా కూడా పనిచేశారు. 2008లో, భారత టెస్ట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు, సంచలనం రేపిన ‘మంకీగేట్’ వివాదాన్ని ఆయనే పరిష్కరించారు. కాగా క్రికెట్‌తో పాటు శ్రీధర్ కు నృత్యం, సంగీతంపై ఆసక్తి ఉండేది. కళాశాలలో నాటకాలు కూడా వేసేవాడు. కథలు కూడా రాసేవాడు. అయితే 2017 సంవత్సరంలో, 51 ఏళ్ల శ్రీధర్ తన ఇంట్లో గుండెపోటు బారిన పడ్డాడు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

Cricketer MV Sridhar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.