నందమూరి, మెగా హీరోలతో ఆడిపాడింది.. కట్ చేస్తే నటనకు గుడ్ బై చెప్పి.. ఇప్పుడు ఇలా

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలామంది కెరీర్ ప్రారంభంలో వివిధ రకాల ఉద్యోగాలు, పనులు చేసిన వారే. ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇంటర్మీడియెట్ వరకు సైన్స్ స్టూడెంట్. కానీ డిగ్రీలో అనూహ్యంగా ఫిలాసఫీ ఆర్ట్స్ సబ్జెక్టును తీసుకుంది.

నందమూరి, మెగా హీరోలతో ఆడిపాడింది..  కట్ చేస్తే నటనకు గుడ్ బై చెప్పి.. ఇప్పుడు ఇలా
Actress

Updated on: Sep 03, 2025 | 11:14 AM

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం.. ఈ రంగంలో రాణించడానికి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రయత్నిస్తుంటారు. హీరోయిన్ గా అవకాశాలు అందుకున్న చాలా మంది సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంటే మరికొంతమంది మాత్రం అవకాశాలు లేక వెనకబడుతూ ఉంటారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ను గుర్తుపట్టారా.? ఈ అందాల తార ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. నందమూరి, మెగా హీరోలతో ఆడిపాడింది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ హీరోయిన్ గా ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది. అందుకే ఇప్పుడు స్పోర్ట్స్ యాంకర్ గా అవతారమెత్తింది. అయితే ఈ స్పోర్ట్స్ ప్రజెంటర్ గా వ్యవహరించడం ఈ ముద్దుగుమ్మకేమీ కొత్త కాదు. గతంలో పలు ప్రముఖ ఛానెల్స్ లో న్యూస్ అండ్ స్పోర్ట్స్ ప్రజెంటర్ గా వర్క్ చేసింది. అయితే మధ్యలో హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంది. మరి ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా?

ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!

ఆమె మరెవరో కాదు నందమూరి కల్యాణ్ రామ్ సూపర్ హిట్ మూవీ పటాస్ లో హీరోయిన్ గా నటించిన శృతి సోది. ఇందులో రౌడీ ఇన్ స్పెక్టర్ మూవీలోని ‘అరే ఓ సాంబ’ సాంగ్ ను రీమిక్స్ చేయగా తన డ్యాన్సు , స్టెప్పులతో కేక పుట్టించిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అనిల్ రావిపూడి- సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సుప్రీమ్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. ఆ తర్వాత నవీన్ చంద్ర హీరోగా వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రంలో ప్రియ పాత్రలో మెరిసింది. ఇదే ఆమెకు తెలుగులో చివరి సినిమా. ఢిల్లీలో పుట్టిన శృతి సోధి ఫిలాసఫీలో ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక.. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే

హిందీలో న్యూస్ ఎక్స్ , మరో ఛానల్లో న్యూస్ ప్రజెంటర్‌గా పని చేసింది. అదే సమయంలో నటిగా పలు పంజాబీ చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాతే పటాస్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి ప్రస్తుతం స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నెట్టింట ఆమెకు సుమారు 9 లక్షలకు మందికి పైగా ఫాలో వర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోందీ అందాల తార.

విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే\

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.