మనసంతా నువ్వే..! అబ్బో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ప్రేమకథలలో మనసంత నువ్వే ఒకటి. దివంగత హీరో ఉదయ్ కిరణ్ కెరీర్నే మలుపు తిప్పిన సినిమా ఇది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ అటు మ్యూజికల్ సూపర్ హిట్.

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కెరీర్ లో ఎన్నో మెమరబుల్ మూవీస్ ఉన్నాయి. వాటిలో మనసంతా నువ్వే సినిమా ఒకటి. ఈ సినిమాను ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టదు. మనసంతా నువ్వే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. VN ఆదిత్య దర్శకత్వం వచ్చిన ఈ సినిమా 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సూపర్ హిట్ సినిమాలో రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్.పీ పట్నాయక్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాగే తూనీగ తూనీగ సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. ఇప్పటికీ ఈ సాంగ్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రీమాసేన్ చిన్ననాటి పాత్రలో నటించిన చిన్నారి గుర్తుందా..? ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
ఏడు వింతలను ఏడిపించడానికే పుట్టిందేమో మావ..! డైరెక్టర్ రవికుమార్ కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!!
ఆ చిన్నారి పేరు సుహాని కలిత.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది. తెలుగు , హిందీ , మలయాళం అలాగే బెంగాలీ సినిమాల్లో నటించింది సుహాని. అంతే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. తెలుగులో శ్రీశైలం, స్నేహగీతం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సుహాని.
ప్రభాస్ కల్కి 2లో ఆ యంగ్ హీరో కూడా.. అభిమన్యుడి పాత్రలో ఎవరంటే
ఈ చిన్నది ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన సుహాని.. ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా రాణిస్తుంది. అయితే ఈ చిన్నది ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది. హీరోయిన్స్ ను మించిన అందంతో కవ్విస్తున్న ఈ అమ్మడు అనవసరంగా సినిమాలకు గుడ్ బై చెప్పింది అంటున్నారు కొందరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుహాని.. రెగ్యులర్ గా తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
విక్రమార్కుడు సినిమాలో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




