Tollywood : 18 ఏళ్లకే మిస్ ఇండియా.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే. 61 ఏళ్ల వయసులోనూ తరగని అందం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో వెండితెరను ఏలిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అప్పట్లో తమ నటనతో సినీప్రియును ఉర్రూతలూగించిన తారలు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు చక్రం తిప్పిన తారలు.. కొందరు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ కాగా.. మరికొందరు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

దక్షిణాది సినిమా ప్రపంచంలో తమదైన ముద్ర వేసిన అందమైన తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో అప్పట్లో సినీప్రియులకు నిద్రలేకుండా చేసిన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో అనేక సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్స్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికీ వెండితెరపై తమ నటనతో అలరిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయ్యారు కొందరు హీరోయిన్స్. మరికొందరు ఫ్యామిలీ, వ్యాపారం అంటూ బిజీగా ఉంటున్నారు. అయితే ఒకప్పుడు అందచందాలతో కట్టిపడేసిన ఓ హీరోయిన్.. ఇప్పటికీ 61 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తెలుగులో చిరంజీవితో క్రేజీ ప్రాజెక్ట్ చేసింది. ఇప్పటికీ ఆ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ మీనాక్షి శేషాద్రి.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
మీనాక్షి శేషాద్రి.. తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆపద్భాంధవుడు సినిమాలో నటించింది. ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అందమైన రూపం, సహజ సౌందర్యం, సంప్రదాయ దుస్తులలో ఎంతో సింపుల్ గా కనిపిస్తూనే తనదైన నటనతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించిన మీనాక్షి.. ఆ తర్వాత హిందీలో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె వయసు 61 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తున్నారు. 18 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా పోటీలో గెలిచిన మీనాక్షి.. 1982లో పెయింటర్ బాబు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ త్రవాత 1983లో సుభాష్ ఘై దర్శకత్వం వహించిన హీరో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
హిందీలో అనేక చిత్రాల్లో నటించిన మీనాక్షి.. తెలుగులో చిరంజీవితో కలిసి ఆపద్భాంధవుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 1996లో విడుదలైన ఘాతక్ ఆమె చివరి సినిమా. ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఆమె నటనకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..




