Actress: అప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు కుందనపు బొమ్మలా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ కుర్రాళ్ల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?.. చాలా కాలం తర్వాత క్రేజీ ఫోటోస్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Actress: అప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు కుందనపు బొమ్మలా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..  ?
Sheela

Updated on: Jul 25, 2025 | 11:46 AM

సాధారణంగా తెలుగు సినీరంగంలోకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు…పోతుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే స్టార్ స్టేటస్ సంపాదించుకుంటారు. అలాగే పలువురు హీరోయిన్ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోతుంటారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీయెస్ట్ బ్యూటీ. తెలుగులో రామ్ పోతినేని, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించి మెప్పించింది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా..?

తనే హీరోయిన్ షీలా కౌర్. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాతో తెలుగులో ఫుల్ ఫేమస్ అయ్యింది. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 20 సినిమాల్లో నటించింది. ఇక నవదీప్ హీరోగా నటించిన సీతాకోక చిలుక సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుంది. అలాగే మస్కా, అదుర్స్ వంటి చిత్రాలతో మెప్పించింది. గ్లామర్ బ్యూటీగా వెండితెరపై మాయ చేసిన షీలాకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు.

ఇవి కూడా చదవండి

చివరగా 2011లో బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. కొన్నేళ్ల క్రితం ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. 2020లో కేరళకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని వివాహం చేసుకుని చెన్నైలో ఉంటుంది. చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న షీలా.. తాజాగా చీరకట్టులో ఎంతో సింపుల్ లుక్స్ షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..