
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు అర్జెంట్ గా హిట్ కావాలి.. అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా చేసినప్పటికీ ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇటీవల నితిన్ తనకు భీష్మ సినిమాలాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు డైరెక్షన్ లో ఓ సినిమా చేశాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రాబిన్ హుడ్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇక రీసెంట్ గా తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమాలో నితిన్ కు జోడీగా వర్ష బొల్లమ్మ నటించింది. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. వీరితో పాటు మరో ముద్దుగుమ్మ కూడా నటించింది ఆమె పేరే స్వసికా.. ఈ ముద్దుగుమ్మ తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా అందంగా ఉండే ఈ చిన్నది తమ్ముడు సినిమా కోసం డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. ఓ గిరిజన యువతిగా నటించి ఆకట్టుకుంది.
తమ్ముడు సినిమా నిరాశ పరిచినప్పటికీ స్వసికా నటన అందరిని ఆకట్టుకుంది. ఈ భామ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న స్వసికా.. తమ్ముడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తెలుగు డెబ్యూ మూవీనే ఇలా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించి అలరించింది. ఇక ఇప్పుడు ఆది సాయి కుమార్ నటిస్తున్న శంబాల సినిమాలోనూ నటిస్తుంది. అలాగే తెలుగులో ఈ బ్యూటీకి మరికొన్ని సినిమా ఛాన్స్ లు కూడా వస్తున్నాయని తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి