
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో మోస్ట్ క్రేజీ బ్యూటీ. ఒక్క సినిమాతోనే పాపులర్ అయ్యింది. తెలుగులో కథానాయికగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ డార్లింగ్ నటించిన ఓ చిత్రంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. సినిమాలో ఆమె కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుందా.. ? పైన ఫోటోలో హీరోయిన్ పేరు మధు శర్మ. ఈ పేరు అస్సలు గుర్తుపట్టరు.. కానీ ప్రభాస్ నటించిన పౌర్ణమి సినిమాలో మోహిని అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పుడు డార్లింగ్ నటిస్తున్న రాజాసాబ్, ఫౌజీ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదెలా ఉంటే.. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అడియన్స్ హృదయాలు దోచుకున్నారు ప్రభాస్. అందులో పౌర్ణమి ఒకటి. ఈ సినిమాలోని సాంగ్స్ ఎంతగా హిట్టయ్యాయో చెప్పక్కర్లేదు. ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ అయిన అమ్మడు మధుశర్మ. ఇందులో ప్రభాస్ ను ఇష్టపడే వివాహిత మోహిని పాత్రలో కనిపించింది. పౌర్ణమి కంటే ముందు హిందీ, మరాఠీ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో గురు పర్వాయ్ సినిమాతో నటిగా ప్రయాణం చెప్పలేదు. లక్షణ నటుడు జగపతి బాబు హీరోగా నటించిన పాండు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
తెలుగులో అదిరిందయ్యా చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్సీ, పార్టీ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటించిన మధు శర్మ.. సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం భోజ్ పురి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..