AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అస్సలు ఊహించలేరు.. ఈ స్కూల్ డ్రస్‌లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోవడంతో ఇతర బాషల నుంచి కూడా నటీనటులు మన తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది అందాల భామలు మన తెలుగులో సినిమాలు చేసి మెప్పిస్తున్నారు.

Tollywood: అస్సలు ఊహించలేరు.. ఈ స్కూల్ డ్రస్‌లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 13, 2024 | 4:13 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందం అభినయంతో ఆకట్టుకుంటున్నారు. కొత్త కొత్త హీరోయిన్స్ తమ అందం తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోవడంతో ఇతర బాషల నుంచి కూడా నటీనటులు మన తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది అందాల భామలు మన తెలుగులో సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిల్లో ఒకరు ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగులోనూ అమ్మడు సినిమా చేసింది. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆమె ఎవరో కనిపెట్టారా.? ఒక్కసారి చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించే అందం ఆమెది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

పై ఫొటోలో స్కూల్ డ్రస్ లో ఉన్న హీరోయిన్ ను కనిపెట్టడం పెద్ద కష్టం కాకపోవొచ్చు. పై ఫొటోలో మధ్యలో ఉంది ఆమె.. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నజ్రియా నజీమ్. మలయాళ ఇండస్ట్రీలో ఈ చిన్నది వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మళయాళంతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఇక ఈ చిన్నది రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది నజ్రియా నజీమ్.

ఇది కూడా చదవండి : S. S. Rajamouli: రాజమౌళికి బాగా నచ్చిన నటి.. సావిత్రి, అనుష్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

ఇక ఈ చిన్నది తెలుగులో డైరెక్ట్ గా నటించిన ఏకైక సినిమా అంటే సుందరానికి అనే సినిమా చేసింది. ఈ సినిమాలో నాని హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. అంటే సుందరానికి సినిమా హిట్ అవకపోవడంతో.. ఈ చిన్నది తెలుగులో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక ఈ అమ్మడు మలయాళ స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాల జోరు తగ్గించింది నజ్రియా నజీమ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఫొటోలతో ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us