Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఈ ఫొటోలో ఉన్న క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా..? ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను కనిపెట్టడం లాంటివి మనం చేస్తూ ఉంటాం.. అలాగే మొఖం కనిపించకుండా ఉండే ఫోటోలు కూడా వైరల్ గా మారుతుంటాయి. ఇక వెరైటీ గెటప్స్ ఉన్న హీరోయిన్స్ కూడా గుర్తుపట్టడం ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్నగుర్తుపట్టారా..? సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం..?

Actress : ఈ ఫొటోలో ఉన్న క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా..? ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2023 | 1:45 PM

సినిమా పజిల్స్ కు ఉండే క్రేజే వేరు. సినిమా నాలెడ్జ్ పెంచుకునేందుకు చాలా మంది రకరకాల మూవీ పజిల్స్ ను సాల్వ్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి మూవీ పజిల్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే హీరోయిన్స్ ఫోటోలకు సంబంధించిన పజిల్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను కనిపెట్టడం లాంటివి మనం చేస్తూ ఉంటాం.. అలాగే మొఖం కనిపించకుండా ఉండే ఫోటోలు కూడా వైరల్ గా మారుతుంటాయి. ఇక వెరైటీ గెటప్స్ ఉన్న హీరోయిన్స్ కూడా గుర్తుపట్టడం ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్నగుర్తుపట్టారా..? సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం..? చాలా వరకు ఆమె ఎవరో కనిపెట్టలేకపోయారు.. మరి మీరూ..

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు. ట్రైబల్ గెటప్ లో ఆకట్టుకుంటున్న ఆ భామ మాళవిక మోహన్. పట్టం పోల్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ మలయాళ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది మాళవిక మోహన్. ఆతర్వాత నాను మట్టు వరలక్ష్మి అనే కన్నడ సినిమాలో నటించింది. ఆవెంటనే బియాండ్ ది క్లౌడ్స్ అనే హిందీ సినిమాలోనూ నటించింది. ఆతర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

అయితే ఈ అమ్మడి ఖాతాలో ఇంతవరకు భారీ బ్లాక్ బస్టర్ మూవీ పడలేదు. పేటసినిమా తెలుగులోనూ డబ్ అయిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఈ భామ చేసిన దళపతి విజయ్ మాస్టర్, ధనుష్ మారన్ సినిమాలుకూడా తెలుగులో డబ్ అయ్యాయి. ఇక ఇప్పుడు విక్రమ్ తో కలిసి సినిమా చేస్తుంది. పైన కనిపిస్తున్న పోస్టర్ ఆమూవీలోనిదే.. విక్రమ్ తంగలాన్‌ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆయన చాలా డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. అలాగే ఈ మూవీ నటిస్తున్న మాళవిక కూడా ఇలా డిఫరెంట్ గెటప్ లో కనిపించునున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..