సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే అంత సులభం కాదు. సినిమా అవకాశాలు అందుకోవడానికి చాలా మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. తప్పటడుగు వేయడం.. లేదా రాంగ్ ఛాయిస్లు ఎంచుకోవడంతో సినీ కెరీర్ క్లోజ్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ హీరోయిన్ 17 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. చిన్నవయసులో నటన మొదలు పెట్టిన ఈ చిన్నది. తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఊహించని విధంగా 24 ఏళ్లకే కెరీర్ క్లోజ్ అయ్యింది. ఇంతకూ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే ఈ అమ్మడు కూడా పెద్ద సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ తక్కువ సమయంలోనే కెరీర్ ను క్లోజ్ చేసుకుంది. ఆమె పేరే పూజా భట్. బాలీవుడ్ నటి పూజ భట్ 1972 ఫిబ్రవరి 24న మహేష్ భట్, కిరణ్ భట్ దంపతులకు జన్మించారు. తన తండ్రి మహేష్ భట్ గుజరాత్ కు చెందినవాడు. ఆమె తల్లి ఇంగ్లీష్, స్కాటిష్ , అర్మేనియన్. పూజ భట్ కు సోదరుడు, రాహుల్ భట్, సోదరి షాహీన్, అలియా భట్ ఉన్నారు.
పూజ భట్ 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చింది. జఖ్మ్, సడక్ 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడు ఎక్కువకాలం హీరోయిన్ గా సినిమాల్లో రాణించలేకపోయింది. చిన్న వయసులోనే ఆమె స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తన అందం, నటనా నైపుణ్యంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. కానీ 24 ఏళ్ల వయసులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో హీరోయిన్ గా కెరీర్ కు పులిస్టాప్ పెట్టి దర్శకత్వం వైపు అడుగులేసింది. అయితే ఆమె కెరీర్ క్లోజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. చిన్న వయసులోనే ఆమె మద్యానికి బానిస అయ్యింది. అలాగే ఆమె బోల్డ్ లుక్స్ కూడా వైరల్ అయ్యాయి. వీటితో పాటు మ్యాగజైన్ కవర్ కోసం తండ్రిని ముద్దు పెట్టుకుంది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. ఇవన్నీ ఆమె సినీ కెరీర్ పై ప్రభావం చూపించాయి.