
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు. అవకాశాలు రావడం ఒక ఎత్తు.. వచ్చి అవకాశాలను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. కొంతమంది మాత్రం వెనకబడుతున్నారు. వరుసగా సినిమాలు చేసిన సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. వరుసగా సినిమా అవకాశాలు వచ్చినా కూడా.. హిట్స్ లేక సతమతం అవుతున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.?
తెలుగులో వరుసగా 16 సినిమాలు చేసింది.. కానీ రెండు అంటే రెండు సినిమాలు మాత్రమే అందులో హిట్ అయ్యాయి. దాంతో హీరోయిన్ గా ఉండే ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. అయినా సక్సెస్ రాలేదు. దాంతో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇంతకూ ఆమె ఎవరు అనుకుంటున్నారా.? ఆమె హెబ్బా పటేల్. అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదాని పేరు మారుమ్రోగింది.
వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోయింది. ఈ అమ్మడు నటించిన ఆ నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాతో మరో హిట్ అందుకుంది. కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ కాలేదు. దాంతో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అయినా కూడా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతుంది. అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నది. ఓ వైపు చీరకట్టులో ఆకట్టుకుంటూనే.. మరో వైపు మోడ్రన్ డ్రస్సుల్లో మెరుస్తూ మెప్పిస్తుంది. ఇక ఈ అమ్మడి లేటెస్ట్ క్రేజీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.