తెలుగు సినీ ప్రియులకు మనసుకు దగ్గరైన ప్రేమకథలు ఎక్కువే. ఒకప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు ఎక్కువే. ఇప్పటికీ ఆ సినిమాలు వస్తుంటే టీవీలకు అతుక్కుపోతుంటారు. అందులో సంపంగి ఒకటి. 90’s కుర్రాళ్లకు ఇష్టమైన హార్ట్ ఫేవరేట్ మూవీ ఇది. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్. హిందూ, ముస్లీం కుటుంబాల మధ్య స్నేహంలో ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారితీసింది అనేది ఈ సినిమా కథ. డైరెక్టర్ సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో దీపక్ హీరోగా నటించగా.. కంచి కౌల్ హీరోయిన్ గా కనిపించింది.
సంపంగి సినిమాలో చంద్రమోహన్, చలపతి రావు, సన, శివాజీ రాజా, రంగనాథ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కంచి కౌల్ తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తనదైన నటనతో అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస ఆఫర్స్ అందుకుంది. ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు చిత్రాల్లో కనిపించిన కంచి కౌల్.. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది.
2011లో బుల్లితెర సీరియల్ నటుడు షబ్బీర్ అహ్లువాలియాను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..