Sontham Movie: షాకింగ్ లుక్‏లో సొంతం హీరోయిన్.. క్యూట్‏గా ఉండే అమ్మాయి ఇప్పుడు మోడ్రన్‏గా..

సొంతం సినిమా తెలుగు జనాలు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ అయ్యింది. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ చిత్రంలోని సాంగ్స్ వినబడుతూనే ఉంటాయి.

Sontham Movie: షాకింగ్ లుక్‏లో సొంతం హీరోయిన్.. క్యూట్‏గా ఉండే అమ్మాయి ఇప్పుడు మోడ్రన్‏గా..
Sontham Movie
Follow us

|

Updated on: Oct 27, 2024 | 1:42 PM

తెలుగు ప్రేక్షకుల మనసులలో ఇప్పటికీ నిలిచిపోయిన అందమైన ప్రేమకథ సొంతం. ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, రోహిత్ హీరోలుగా నటించారు. అలాగే ఇందులో నమిత కథానాయికగా కనిపించి మెప్పించింది. అలాగే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ మూవీలోని సాంగ్స్ వినిపిస్తుంటాయి. అలాగే ఇందులో సెకండ్ హీరోయిన్‌గా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ మీకు గుర్తుందా..? అందం, అంతకు మించిన అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో ఆ బ్యూటీకి ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇందులో సౌమ్య పాత్రలో క్యూట్ లుక్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది. ఆ హీరోయిన్ పేరు నేహా పెండ్సే.

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సొంతం సినిమాలో రోహిత్ ప్రేయసిగా కనిపించింది. ఈ సినిమా వచ్చినప్పుడు ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన నేహకు తెలుగులో మాత్రం మంచి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. 2020లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈ తార మళ్లీ వెండితెరపై కనిపించలేదు.

అయితే సినిమాలకు దూరంగా ఉన్న ఈ తార.. అటు సీరియల్స్ చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Nehha Pendse (@nehhapendse)

ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్‍ లుక్‏లో తారక్.. వేరేలెవల్ అంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆసియా ఛాంపియన్ గా అఫ్ఘనిస్తాన్.. ఫైనల్ లో శ్రీలంక చిత్తు
ఆసియా ఛాంపియన్ గా అఫ్ఘనిస్తాన్.. ఫైనల్ లో శ్రీలంక చిత్తు
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుండి మరో లెక్క..
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుండి మరో లెక్క..
'ఈఏపీ సెట్‌ 4వ విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోండి..' హైకోర్టు
'ఈఏపీ సెట్‌ 4వ విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోండి..' హైకోర్టు
ధన త్రయోదశి రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే
ధన త్రయోదశి రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే
సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!
సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!
'BC స్టడీసర్కిళ్ల ద్వారా అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తాం'
'BC స్టడీసర్కిళ్ల ద్వారా అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తాం'
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. తగ్గిన బంగారం ధర.
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. తగ్గిన బంగారం ధర.
లారీ నడుపుతూ నిద్రొస్తుందని కనురెప్పలు వాల్చడు..అంతే..
లారీ నడుపుతూ నిద్రొస్తుందని కనురెప్పలు వాల్చడు..అంతే..
చైనాలో తగ్గిన జననాలు ముతబడుతున్న స్కూల్స్‌.. భారీగా వృద్ధ జనాభా
చైనాలో తగ్గిన జననాలు ముతబడుతున్న స్కూల్స్‌.. భారీగా వృద్ధ జనాభా
కుబేరుడికి ఆలయం ఉందని తెలుసా..! ధనత్రయోదశి రోజున ప్రత్యేక పూజలు
కుబేరుడికి ఆలయం ఉందని తెలుసా..! ధనత్రయోదశి రోజున ప్రత్యేక పూజలు