AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neninthe Movie: బాబోయ్.. రవితేజ నేనింతే హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్‏గా..

ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ శియా గౌతమ్ కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. చక్రి సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఈ మూవీకి యువత ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.

Neninthe Movie: బాబోయ్.. రవితేజ నేనింతే హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్‏గా..
Aditi
Rajitha Chanti
|

Updated on: Jul 14, 2024 | 12:01 PM

Share

మాస్ మాహారాజా రవితేజ హీరోగా.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా నేనింతే. 2008లో విడుదలైన ఈ సినిమా సినీ ప్రియులను ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కమర్షియల్ హిట్ కాకపోయినా.. ఈ సినిమాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈమూవీలో పూరీ స్టోరీ, రవితేజ యాక్టింగ్ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ శియా గౌతమ్ కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. చక్రి సంగీతం అందించిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఈ మూవీకి యువత ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కనిపించిన హీరోయిన్ శియా గౌతమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె అసలు పేరు అదితి గౌతమ్. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన అదితి.. సినిమాల్లోకి వచ్చాకా.. శియా గౌతమ్ గా పేరు మార్చుకుంది. నేనింతే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మాత్రం అవకాశాలు అందుకోలేదు. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తెలుగులోనే కాకుండా హిందీలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన సంజూ చిత్రంలో కనిపించింది. కానీ ఆ సినిమా కూడా హిట్ కాలేదు. దీంతో అటు బీటౌన్ లోనూ ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా క్లిక్ కాలేదు.

చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శియా గౌతమ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ ఫోటోలు షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. రవితేజ సరసన బొద్దుగా పద్దతిగా కనిపించిచన సియా గౌతమ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. క్రేజీ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. కానీ ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నేనింతే హీరోయిన్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us