Chandramukhi: బాబోయ్.. ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఎంతందంగా మారిందో చూశారా..
ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే అడియన్స్ టీవీలకు అతుక్కుపోతారు. డైరెక్టర్ పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీతోపాటు నయనతార, జ్యోతిక, నాజర్, ప్రభు, వడివేలు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రజినీ, వడివేలు మధ్య వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ చంద్రముఖి. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తమిళంతోపాటు.. తెలుగులోనూ ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ వసూళ్లూ రాబట్టింది. హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే అడియన్స్ టీవీలకు అతుక్కుపోతారు. డైరెక్టర్ పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీతోపాటు నయనతార, జ్యోతిక, నాజర్, ప్రభు, వడివేలు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో రజినీ, వడివేలు మధ్య వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే.. చంద్రముఖి సినిమాలో రజినితో కలసి సందడి చేసిన చిన్నారి గుర్తుందా ?. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ చిన్నారి లేటేస్ట్ ఫోటోస్ చూసేందుకు నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చంద్రముఖి సినిమాలో కనిపించిన చిన్నారి పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. తమిళంలో అనేక చిత్రాలు, సీరియల్స్ చేసింది. కానీ తెలుగులో అంతగా కనిపించలేదు. చంద్రముఖి తర్వాత ప్రహర్షిత తక్కువగా సినిమాల్లో కనిపించిది.
ప్రహర్షిత 2021లో వివాహం చేసుకుంది. 2022లో ఆమెకు ఓ పాప జన్మించింది. దాదాపు 18 ఏళ్లపాటు నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత.. ఇప్పుడు మరోసారి బుల్లితెరపై సందడి చేసింది. పలు సీరియల్లలో నటిస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోస్, తన కూతురి ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ ను ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.