ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా విలన్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నారు దర్శకులు. దేహదారుడ్యం.. లుకింగ్స్ అన్నింటినిలోనూ హీరోలకు పోటీగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల యంగ్ స్టర్స్ ప్రతినాయికులుగా మెప్పిస్తున్నారు. అలాగే.. ఒకప్పుడు హీరోలుగా నటించి ప్రస్తుతం విలన్స్ గా మారిపోయారు పలువురు స్టార్స్. జగపతి బాబు, శ్రీకాంత్, సంజయ్ దత్, కార్తికేయ వంటి హీరోలు ఇప్పుడు ప్రతినాయకులుగా మెప్పిస్తున్నారు. చిన్న సినిమాల్లో హీరోగా నటించినవారు.. పవర్ ఫుల్ విలన్ పాత్రలలో నటించి తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీంతోపాటు పాన్ ఇండియా సినిమా కల్చర్ స్టార్ట్ కావడంతో పరభాష హీరోస్ సైతం విలన్స్ గా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తమ నటనతో ప్రేక్షకులను భయపెట్టిన స్టార్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వారందరికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చెప్పుకోవాలి.
అప్పట్లో సినిమాల్లో విలన్స్ అంటే.. భీకరమైన లుక్స్.. ఎత్తు.. బలంగా కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారిలో మోహన్ రాజ్ ఒకరు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. లారీ డ్రైవర్, చినరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, శివయ్య, సమరసింహారెడ్డి, నరసింహరాయుడు చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్ లాంటి స్టార్ హీరోలకు ప్రతి నాయకుడిగా కనిపించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా ?..
కేరళకు చెందిన ఆయన చివరిసారిగా నరసింహనాయుడు సినిమాలో నటించారు. ఆ తర్వాత నటుడిగా తన ప్రస్థానం ముగించి ప్రభుత్వ ఉద్యోగిగా సెటిలైపోయారు. మధురైలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రాడ్యూయేషన్ అనంతరం ఆర్మీలో పనిచేసిన ఆయన ఆ తర్వాత కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. మళ్లీ సెంట్రల్ సర్వీస్ లోకి వెళ్లి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉద్యోగం సంపాదించి అసిస్టెంట్ కమిషనల్ హోదాలో కొనసాగుతున్నారు.