AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు మేడమ్.. మొగలిరేకులు సీరియల్ బ్యూటీ గుర్తుందా.. ? నెట్టింట గత్తరలేపుతున్న ఫోటోస్..

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది నటీమణులు తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. వారిలో అందులో ఈ అమ్మడు ఒకరు. సీరియల్స్‌లో చక్కని నటనతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఈమె, అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Serial Actress : ఎన్నాళ్లకెన్నాళ్లకు మేడమ్.. మొగలిరేకులు సీరియల్ బ్యూటీ గుర్తుందా.. ? నెట్టింట గత్తరలేపుతున్న ఫోటోస్..
Karuna Bhushan
Rajitha Chanti
|

Updated on: Jul 08, 2026 | 12:55 PM

Share

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ మొగలిరేకులు. అప్పట్లో భారీ విజయాన్ని సాధించి.. యువతను సైతం ఆకట్టుకుంది. ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది నటీనటులు పాపులర్ అయ్యారు. అందులో కరుణా భూషణ్ ఒకరు. ఆమెకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. చక్రవాకం తర్వాత మంజులా నాయుడు దర్శకత్వంలో వచ్చిన ఈ సీరియల్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సీరియల్‌లో లీఖిత కామిని పోషించిన ‘దేవి’ పాత్రలోకి కరుణా భూషణ్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చారు. సీరియల్ రెండో జనరేషన్‌లో కథానాయకుడు ‘మున్నా’ (సాగర్) భార్యగా, ఆర్కే నాయుడు కోడలిగా ‘దేవి’ పాత్ర కథలో చాలా కీలకంగా మారుతుంది. మున్నా, దేవిల మధ్య వచ్చే లవ్ సీన్స్, ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామాలో ఒక బాధ్యతాయుతమైన కోడలిగా కరుణ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. లీఖిత స్థానంలో వచ్చినప్పటికీ, దేవి పాత్రలోని అమాయకత్వాన్ని, గంభీరత్వాన్ని కరుణ తనదైన శైలిలో పండించి వీక్షకులకు త్వరగానే కనెక్ట్ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

బాలనటిగా ఎన్నో సినిమాల్లో చేసినా, ‘యువ’ సీరియల్ తర్వాత కరుణకు బుల్లితెరపై నటిగా స్థిరపడటానికి ‘మొగలిరేకులు’ పెద్ద ప్లాట్‌ఫార్మ్‌గా నిలిచింది. ఈ సీరియల్ ఇచ్చిన క్రేజ్‌తో ఆమె ఆ తర్వాత ‘శ్రావణ సమీరాలు’ వంటి వరుస హిట్ సీరియల్స్ లో లీడ్ రోల్స్ సాధించారు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన ఆమె.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోనూ ఆక్టటుకున్నారు. అలాగే పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ‘జ్ఞాపకాలు’ అంటూ ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఒకప్పుడు తాను ఎలా ఉండేది, ఆనాటి మధుర క్షణాలు ఎలా ఉన్నాయో ఈ ఫోటోల ద్వారా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు , ఫాలోవర్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

నటిగా బిజీగా ఉంటూనే, అప్పుడప్పుడు తన వ్యక్తిగత జ్ఞాపకాలను, ఫోటోలను పంచుకుంటూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండటానికి కరుణ భూషణ్ ప్రయత్నిస్తుంటారు. తాజాగా వైరల్ అయిన ఈ ఫోటోలు ఆమెకు ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించాయి. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

కరుణా భూషణ్ ఫోటోస్..

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Follow Us