Tollywood: ప్రభాస్‌తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.? అయ్యబాబోయ్.. ఎంతలా మారిపోయిందో తెలుసా.!

|

Apr 15, 2023 | 9:15 PM

'గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది.. నిలవదు కద హృదయం..

Tollywood: ప్రభాస్‌తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.? అయ్యబాబోయ్.. ఎంతలా మారిపోయిందో తెలుసా.!
Tollywood 1
Follow us on

‘గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది.. నిలవదు కద హృదయం.. నువు ఎదురుగ నిలబడితే.. కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే.. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది!’.. ఈ పాట మీకు గుర్తుండొచ్చు. 2002లో హీరో నాగార్జున, దర్శకుడు విజయ్ భాస్కర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మన్మధుడు’ సినిమా.. అప్పట్లో ఓ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో హీరోయిన్లుగా సోనాలి బింద్రేతో పాటు అన్షు అంబానీ నటించింది. ప్రస్తుతం ఈమె గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఈ అందాల భామ ఏం చేస్తోంది.? ఇప్పుడెలా ఉందో.? ఇప్పుడు తెలుసుకుందామా..

ఫ్యాషన్ డిజైనరయిన అన్షు అంబానీ.. 2002లో ‘మన్మధుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే అటు అందం, ఇటు అభినయంతో అభిమానులను ఆకట్టుకుంది. అలాగే ఆ తర్వాత ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’ సినిమాతో ఫ్యాన్స్‌లోనూ తెగ పాపులారిటీ సంపాదించింది. అలాగే తమిళంలో ‘జై’ సినిమాతో అరంగేట్రం చేసింది ఈ భామ.

సరిగ్గా అవకాశాలు వస్తున్నాయ్ అనగా.. ఈమె 2003లో సచిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని లండన్ వెళ్లిపోయింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఈ జంటకు ఓ పాప.. లండన్‌లోనే సొంతంగా వ్యాపారం చేస్తూ అక్కడే నివసిస్తోంది అన్షు అంబానీ.

ఇవి కూడా చదవండి