sreeleela: ఒకేసారి 8 సినిమాలు.. శ్రీలీల ఎలా మ్యానేజ్ చేస్తున్నారబ్బా..?
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ప్రస్తుతం వరుస చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా మారిపోయింది కుర్రహీరోయిన్ శ్రీలీల. ఆ తర్వాత వెంటనే మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ప్రస్తుతం వరుస చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా మారిపోయింది కుర్రహీరోయిన్ శ్రీలీల. ఆ తర్వాత వెంటనే మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈ అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అటు సూపర్ స్టార్ మహేష్ బాబు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా..నందమూరి నటసింహం బాలకృష్ణ .. డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్నా ఎన్బీకే 108 చిత్రంలో నటిస్తోంది. అయితే ఇందులో శ్రీలీల రోల్ ఏంటనేది తెలియాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..