తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది తారలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. అద్భుతమైన నటనతో సినీ క్రిటిక్స్ విమర్శలను కూడా సొంతం చేసుకున్నారు. కానీ అంతలోనే ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలా తనదైన నటనతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరోయిన్ లేఖా వాషింగ్టన్. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ వేదం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 2010లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది లేఖా వాషింగ్టన్. వేదం సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, లేఖా వాషింగ్టన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.
కానీ ఈ మూవీ ప్రతి ఒక్కరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అప్పటికే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క ఈ మూవీ కోసం పెద్ద రిస్క్ చేసింది. ఇందులో వేశ్య పాతర్లో కనిపించింది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమిళంలోనూ రీమేక్ చేశారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ దీక్షా సేథ్ కూడా నటించింది. ఇందులో బన్నీ ప్రేయసిగా కనిపించింది. ఇక ఈ సినిమాలో మనోజ్ ప్రేయసిగా కనిపించినా లేఖా.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు.
కమినా, డైనమైట్ సినిమాల్లో చిన్న పాత్రలు పోషించగా.. లేఖాకు అంతగా గుర్తింపు రాలేదు. లేఖా చెన్నైలో నాటక కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. 2008లో జయమకొండాన్ సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వేదం, వా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం లేఖా వాషింగ్టన్ అజ్జీ అనే ప్రొడక్ట్ డిజైన్ కంపెనీ రన్ చేస్తుంది. సినిమాల్లో అంతగా కనిపించని లేఖా.. సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు. కానీ ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.