Lahiri Lahiri Lahirilo : లాహిరి లాహిరి లాహిరిలో హీరో గుర్తున్నారా ?.. ఇప్పుడెం చేస్తున్నారో తెలుసా..
నందమూరి హరికృష్ణ, సుమన్, వినీత్, భానుప్రియ, అంకిత ప్రధాన పాత్రలో నటించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో కథానాయికుడిగా కనిపించారు ఆదిత్య. ఇందులో కె. విశ్వనాథ్ కీలకపాత్రలో కనిపించారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్స్ అందుకుని స్టార్ స్టేటస్ అందుకున్న హీరోస్ గురించి చెప్పక్కర్లేదు. కానీ ఎంత త్వరగా స్టార్ డమ్ సంపాదించుకుంటారో అంతే త్వరగా వెండితెరపై కనుమరుగైనవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరో ఆదిత్య ఓం ఒకరు. ఆనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి చిత్రంతోనే నటుడిగా సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో హీరరోగా బిజీ అయ్యారు. కానీ అంతేతర్వగా డిజాస్టర్స్ అందుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు. నందమూరి హరికృష్ణ, సుమన్, వినీత్, భానుప్రియ, అంకిత ప్రధాన పాత్రలో నటించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో కథానాయికుడిగా కనిపించారు ఆదిత్య. ఇందులో కె. విశ్వనాథ్ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా.. ఇందులో ఆదిత్య నటనకు సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు.
ఈ మూవీ తర్వాత ధనలక్ష్మీ ఐ లవ్ యు, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్లికి రెడీ, భామ కలాపం, ఆఖరి పేజీ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు ఆదిత్య. హీరోగానే కాదు.. స్క్రీన్ ప్లే, పాటల రచయిత, దర్శకుడిగా.. నిర్మాతగానూ రాణించాడు. అయితే హీరోగా అవకాశాలు తగ్గడంతో 2018లో మసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు.




అటు సినిమాలకు దూరమైన ఆదిత్య.. ఇటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన వ్యాపార రంగంలో స్థిరపడిపోయారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




