Sanghavi: హీరోయిన్ సంఘవి ఫ్యామిలీని చూశారా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లలో సంఘవి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నటించి స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో అగ్ర హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ప్రస్తుతం సంఘవి ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Sanghavi: హీరోయిన్ సంఘవి ఫ్యామిలీని చూశారా.. ? ఇప్పుడేం చేస్తుందంటే..
Sanghavi

Updated on: Aug 23, 2025 | 2:24 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. రమ్యకృష్ణ, మీనా, సిమ్రాన్, సంగీత, నగ్మా, మహేశ్వరి, సంఘవి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది హీరోయిన్స్ వెండితెరపై అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. వారిలో సంఘవి ఒకరు. అందం, అభినయంతో బిగ్ స్క్రీన్ పై మాయ చేసిన ఆమె.. అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. చివరగా కొలాంజి అనే తమిళం చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. తెలుగులో ఆమెకు అప్పట్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది.

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి

2016లో ఐటీ సంస్థ అధినేత ఎన్. వెంకటేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించింది. వివాహం తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంఘవి.. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది. సినిమాలు చేయకపోయినప్పటికీ బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది.

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ పంచుకుంటుంది. ఇటీవల 90’s హీరోయిన్స్ అందరూ రియూనియన్ అయిన సంగతి తెలిసిందే. వారితో కలిసి సందడి చేసింది సంఘవి.

ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..