Tollywood: దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు క్రేజీ హీరో.. ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..

గతంలో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులకు మంచి ఫాలోయింగ్ ఉండేది. సినిమా మొత్తంలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ కూడా ఉండేది. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చాలా మంది. ఒకప్పుడు సినిమాల్లో నటించి మెప్పించిన ఆ బాలతారలు ఇప్పుడు వెండితెరపై హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. అందులో ఈ కుర్రాడు కూడా ఒకరు.

Tollywood: దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు క్రేజీ హీరో.. ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2024 | 4:19 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు గుర్తున్నాడా.. ? తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. చిన్న వయసులోనే నవ్వించాడు.. భయపెట్టించాడు కూడా. హీరోయిన్ ప్రేమ, భానుచందర్, వనీత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన దేవి సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో తన నటనతో భయపెట్టించాడు. అలాగే మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమాల్లో కనిపించాడు. ఇంతకీ ఆ కుర్రాడి పేరు ఏంటో తెలుసా.. తన పేరు మహేంద్రన్. తెలుగులో ఆహా మూవీతో వెండితెరకు పరిచమయమైన మహేంద్రన్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 1994లో కోలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేంద్రన్.. తెలుగులో అనేక చిత్రాల్లో నటించాడు. చిన్నవయసులోనే తనదైన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు మహేంద్రన్.

తెలుగులో ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు మహేంద్రన్. ముఖ్యంగా దేవీ, లిటిల్ హార్ట్స్ సినిమాల్లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారాలు సైతం సొంతం చేసుకున్నాడు. తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషలలో బాల నటుడుగా దాదాపు 130 సినిమాలలో నటించాడు. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు.

కానీ ఇప్పుడు పెరిగి పెద్దయ్యాక… తమిళంలో హీరోగా అనేక సినిమాలు చేశాడు. అలాగే ఇతర హీరోల సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తున్నాడు. మాస్టర్ సినిమాలో యంగ్ భవాని రోల్‌లో కనిపించింది మహేంద్రనే. గత ఏడాది రిప్అప్ బరీ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మహేంద్రన్.. హీరోగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. థియేటర్లలోనే కాకుండా లేబుల్ అనే ఓటీటీ వెబ్ సిరీస్ ద్వారా సినీ ప్రియులను అలరించాడు. తెలుగులో బాలనటుడిగా అలరించిన మహేంద్రన్ ఇంకా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం ఈ కుర్రాడు తమిళంలోనే నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మహేంద్రన్ ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..