Nanna Movie: నాన్న మూవీలో ఈ చిన్నారి గుర్తుందా ?.. విక్రమ్ కూతురు ఇప్పుడేంత అందంగా ఉందో మీరే చూడండి..

నాన్న సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సారా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏ అందుకున్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో కనిపించింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో సారా అర్జున్ నటించింది. కానీ చాలా తక్కువ నిడివి ఉండడంతో ఎవరూ పెద్దగా ఫోకస్ చేయలేదు.

Nanna Movie: నాన్న మూవీలో ఈ చిన్నారి గుర్తుందా ?.. విక్రమ్ కూతురు ఇప్పుడేంత అందంగా ఉందో మీరే చూడండి..
Nanna Movie

Updated on: Apr 30, 2023 | 4:04 PM

చియాన్ విక్రమ్ కెరీర్‏లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ నాన్న. మానసికంగా ఎదగని తండ్రి పాత్రలో ఈ మూవీలో ఆయన నటన అద్భుతం. కూతురికి..తండ్రికి ఉండే ప్రేమకథనే ఈ చిత్రం. ఇందులో ఆయన కూతురిగా అద్భుతంగా నటించి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. అమాయకమైన నటనతో.. తండ్రి కోసం తపన పడే కూతురిగా నటించి ఆడియన్స్ కంట కన్నీరు పెట్టించింది. ఇందులో తండ్రి కూతుళ్ల ప్రేమను అద్భుతంగా చూపించారు. ఈ మూవీతో చిన్నవయసులోనే ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఆ చిన్నారి పాప టీనేజ్ వయసుకు వచ్చింది. ఇంతకీ ఆ పాప పేరు ఏంటీ అనుకుంటున్నారా ?.. తనే సారా అర్జున్.

నాన్న సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సారా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏ అందుకున్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో కనిపించింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో సారా అర్జున్ నటించింది. కానీ చాలా తక్కువ నిడివి ఉండడంతో ఎవరూ పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇప్పుడు రెండవ భాగంలో సారా అర్జున్ తన లుక్స్‏తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఇందులో సారా అర్జున్ అందమైన అమ్మాయిగా ఎక్కువగా సేపు కనిపించడంతో అందరి కళ్లు ఈ పాపపై పడ్డాయి.

ఇవి కూడా చదవండి

పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నందిని పాత్రను పోషించింది. హీరోయిన్ ఐశ్వర్యరాయ్ టీనేజ్ క్యారెక్టర్ లో సారా నటించడం విశేషం. ఇందులో ఫస్ట్ షాట్ లో అందమైన అమ్మాయి ఆ తర్వాత ఐశ్వర్యగా మారుతుంది. ఇక ఈ చిత్రంలో ఆమె నటనకు అందరూ మంత్రముగ్దులైపోతున్నారు. ప్రస్తుతం హీరోయిన్స్ కంటే మరింత అందంగా కనిపించడంతో సారా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‏గా రాణించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని అంటున్నారు.

Sara Arjun

2011లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ స్టార్ట్ చేసింది సారా అర్జున్. హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో బాలనటిగా అనేక సినిమాలు చేసింది. 2015లో దాగుడుమూత దండాకోర్ సినిమా రాజేంద్రప్రసాద్ మనవరాలిగా కనిపించింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ నటుడే. అతను ఇప్పటికే పలు సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.