
తమిళంతోపాటు.. తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో బిచ్చగాడు సినిమా ఒకటి. తమిళ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తల్లి ప్రాణం కోసం కొడుకు పడే ఆరాటం.. ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకింది. డబ్బింగ్ రూపంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ సినిమాతోనే అటు విజయ్ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో సాట్నా టైటస్ కథానాయికగా నటించింది. తొలి చిత్రంతోనే తన నటనతో.. అందంతో జనాలను కట్టిపడేసింది. ఈ సినిమాతో ఆమెకు అటు కోలీవుడ్ లోనే కాకుండా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీస్ తర్వాత యీథవన్, నీది నాదీ ఒకే కథ, తిట్టం పోట్టు తిరుదుర కూటం చిత్రాల్లో నటించింది. తక్కువ సినిమాలు చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలో దూరమైంది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందో తెలుసుకుందామా.
సాట్నా టైటస్.. 1991 నవంబర్ 28న కేరళలోని కొచ్చిలో జన్మించింది. గ్రాడ్యూయేషన్ అనంతరం నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. పిచ్చైక్కారన్ (తెలుగులో బిచ్చగాడు) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సాట్నాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ మూవీ అనంతరం పలు చిత్రాల్లో నటించిన ఆమె.. పలు వివాదాలతో నిత్యం వార్తలలో నిలిచింది.
కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సాట్నా.. బిచ్చగాడు సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీని సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అతడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరు రిజిస్టర్ వివాహం చేసుకుంది. అయితే వీరి పెళ్లిపై ఆమె తల్లి అప్పట్లో పోలీసులను ఆశ్రయించడం.. అప్పటివరకు ఒప్పుకున్న చిత్రాలను సాట్నా వదిలేసి.. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసింది. ప్రస్తుతం సాట్నా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో సమయం గడుపుతుంది. వీరికి కిరణ్ కార్తిక్ అనే బాబు ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.