Saranya Mohan: ‘భీమిలి’ హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడు ఎంతగా మారిపోయిందో చూశారా ?..

బాలనటిగా తెరంగేట్రం చేసిన శరణ్య.. ఆ తర్వాత కథానాయికగా అలరించారు. 2005లో రిలీజ్ అయిన ఒరు నాల్ ఒరు కనవు సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఆమె.. ఆ తర్వాత తమిళంలో కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేశారు. కానీ 2009లో తెలుగులో వచ్చిన విలేజ్ లో వినాయకుడు సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమయ్యారు.

Saranya Mohan: 'భీమిలి' హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడు ఎంతగా మారిపోయిందో చూశారా ?..
Saranya Mohan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 08, 2023 | 7:14 AM

సౌత్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం.. అభినయంతో ప్రేక్షకులను అలరించిన తారలు .. ఆ తర్వాత పలు చిత్రాలు నటించి మెప్పించారు. ఇక కొందరు హీరోయిన్స్ చాలా సినీపరిశ్రమకు దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ మరికొందరు ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారిలో హీరోయిన్ శరణ్య మోహన్ ఒకరు. బాలనటిగా తెరంగేట్రం చేసిన శరణ్య.. ఆ తర్వాత కథానాయికగా అలరించారు. 2005లో రిలీజ్ అయిన ఒరు నాల్ ఒరు కనవు సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఆమె.. ఆ తర్వాత తమిళంలో కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేశారు. కానీ 2009లో తెలుగులో వచ్చిన విలేజ్ లో వినాయకుడు సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమయ్యారు.

ఇక ఆ తర్వాత 2010లో న్యాచురల్ స్టార్ నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో కథానాయికగా నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి గుర్తింపు రావడమే కాదు.. భీమిలి సినిమా అంటే శరణ్య గుర్తుకు వస్తుంది. అమాయకత్వం, అందం కలబోసిన ఆమె నటన గుర్తొచ్చేస్తుంది. అంతగా ప్రేక్షకులకు చేరువయ్యింది శరణ్య. ఈ సినిమా తర్వాత కత్తి, మరో సినిమాలోనటించారు.

ఇవి కూడా చదవండి

ఇక వరుసగా ఆఫర్స్ వస్తున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాకు దూరం అయ్యారు. ఈ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ..సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.