శర్వానంద్‌ ‘అందరి బంధువయ’ హీరోయిన్‌ గుర్తుందా? తెలుగులో తళుక్కున మెరిసి మాయమైన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా?

టాలీవుడ్ ప్రామిసింగ్‌ హీరో శర్వానంద్‌ కెరీర్‌ ఆరంభంలో నటించిన సినిమా 'అందరి బంధువయ'. సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న చంద్ర సిద్ధార్థ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. సమాజంలో మాయమైపోతున్న మానవతా విలువలకు అద్ధం పట్టేలా రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది.

శర్వానంద్‌ 'అందరి బంధువయ' హీరోయిన్‌ గుర్తుందా? తెలుగులో తళుక్కున మెరిసి మాయమైన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా?
Actress Padmapriya
Follow us
Basha Shek

|

Updated on: May 01, 2023 | 9:10 AM

టాలీవుడ్ ప్రామిసింగ్‌ హీరో శర్వానంద్‌ కెరీర్‌ ఆరంభంలో నటించిన సినిమా ‘అందరి బంధువయ’. సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న చంద్ర సిద్ధార్థ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. సమాజంలో మాయమైపోతున్న మానవతా విలువలకు అద్ధం పట్టేలా రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ మూవీలో శర్వాకు జోడీగా పద్దూ పాత్రలో కోలీవుడ్‌ బ్యూటీ పద్మ ప్రియ జానకిరామన్ కనిపించింది.  అప్పటికీ ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉన్న శర్వానంద్  తో పోటీపడి నటించింది పద్మ.  ఈ సినిమాలో ఆమె అభియానికి మంచి మార్కులు పడ్డాయి.  అలాగే పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా కంటే తెలుగులో శీనువాసంతి లక్ష్మి అనే మూవీలో నటించింది పద్మప్రియ. అందులో ఆర్పీ పట్నాయక్‌ సోదరిగానూ నటించి మెప్పించింది. అయితే అందరి బంధువయ సినిమానే ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. దీంతో పద్మ మరిన్ని తెలుగు సినిమాలు చేస్తుందనుకున్నారు. అయితే ఆమె కేవలం మలయాళం సినిమాలకే పరిమితమైంది.

ప్రేమ వివాహం చేసుకుని..

2010లో వచ్చిన ఏడేళ్ల తర్వాత అంటే 2017లో పటేల్ సార్‌ సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పద్మప్రియ. జగపతిబాబు హీరోగా వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఆమె మళ్లీ మాలీవుడ్‌ సినిమాల్లో బిజీగా మారిపోయింది. ఇప్పటికీ అడపాదడపా మలయాళం సినిమాల్లో మెరుస్తోంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2014 జాస్మిన్‌ షా అనే పారిశ్రామికవేత్తను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం పద్మ ప్రియ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అయితే కేవలం కథాబలమున్న సినిమాల్లోనే నటిస్తోందీ అందాల తార. అన్నట్లు పద్మకు హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. కాలేజీ చదువు ఇక్కడే పూర్తి చేసింది. భరతనాట్యంలో నిపుణురాలైన ఆమె అప్పుడప్పుడు తన డ్యాన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తోంది. వాటిని చూసిన నెటిజన్లు స్టన్‌ అవుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ ఆమె అందంలో ఎలాంటి మార్పు లేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పద్మ ప్రియ లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..