Bhanu Sri Mehra: వరుడు సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
హీరోయిన్ భాను శ్రీ మెహ్రా ఫేస్ ను దాచి పెట్టి వరుడు సినిమాపై సస్పెన్స్ మెయింటైన్ చేశారు దర్శక నిర్మాతలు. సినిమాలో కూడా ప్రథమార్థం ముగిసే ముందు హీరోయిన్ ఫేస్ ను చూపించారు. అయితే సినిమా రిలీజయ్యాక హీరోయిన్ కు ఇంత సస్పెన్స్ అవసరం లేదన్న నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.
గుణ శేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా వరుడు. ఎవరూ మర్చిపోయినా బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను మర్చిపోలేరు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీనికి తోడు సినిమా రిలీజ్ కు ముందు హీరోయిన్ ఫేస్ కనిపించకుండా చేసి మూవీపై హైప్ పెంచారు. ఇక సినిమా థియేటర్లలోకి వచ్చాక కూడా ఇంటర్వెల్ ముందు హీరోయిన్ మొహాన్ని రివీల్ చేశారు. అయితే ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేసినా వర్కవుట్ కాలేదు. వరుడు సినిమా ప్లాఫ్ గా నిలిచింది. ఫలితంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ మూవీ నిలిచింది. ఇక ఎంతో సస్పెన్స్ మెయింటైన్ చేసినప్పటికీ హీరోయిన్ రోల్ కూడా వర్కవుట్ అవ్వలేదు. పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన భానుశ్రీ మెహ్రాకు ఇదే మొదటి తెలుగు సినిమా. వరుడు కంటే ముందు ఈ భామ బాలీవుడ్ చిత్రం బచ్నా ఏ హసీనోలో అతిధి పాత్రలో యాక్ట్ చేసింది. అయితే వరుడు నిరాశ మిగల్చడంతో భాను శ్రీకి తెలుగులో కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. చిల్కూరు బాలాజీ , ప్రేమతో చెప్పన , మహారాజా శ్రీ గాలిగాడు , లింగడు-రామలింగడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, గోవిందుడు అందరి వాడేలే, రన్, మిస్ ఇండియా తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఇక చివరగా 2022లో 10th క్లాస్ డైరీస్ అనే సినిమాలో కనిపించింది.
సినిమాలకు దూరంగా ఉన్న భానుశ్రీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. యూట్యూబ్ చానెల్ పెట్టుకుని తన వ్లాగ్స్ చేసుకుంటోంది. ట్రావెలింగ్ వీడియోలను షేర్ చేస్తోంది. ఆ మధ్యన తన ట్విట్టర్ అకౌంట్ ను అల్లు అర్జున్ బ్లాక్ చేశాడంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది భాను శ్రీ. అలాగే బిగ్ బాస్ షోపై ఆమె చేసిన కామెంట్లు సంచలనం రేపాయి.
భానుశ్రీ మెహ్రా లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఇక ఇన్ స్టా గ్రామ్ లో తరచూ తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తుంటుందీ అందాల తార. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘నెక్ట్స్ సినిమా ఎప్పుడు మేడం’? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భాను శ్రీ గ్లామరస్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి