అన్న ఇది నువ్వేనా..!! తెలుగులో తోప్ హీరో అతను.. ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.?

చాలా మంది నటులు సోషల్ మీడియా ద్వారా.. లేదా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. నెట్టింట క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన చాలా మంది ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వారిలో ఈ హీరో ఒకడు.

అన్న ఇది నువ్వేనా..!! తెలుగులో తోప్ హీరో అతను.. ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.?
Tollywood News

Updated on: Jan 26, 2026 | 12:34 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చాలా మంది హీరోలుగా హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వక ముందు.. షార్ట్ ఫిలిమ్స్, సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ క్రేజ్ తోనే సినిమాల్లోన్నే రాణిస్తున్నారు. ఇక షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన వారు ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. సుహాస్, చాందిని చౌదరి, ప్రియాంకా జవాల్కర్ , వైష్ణవి చైతన్యలాంటి వారు చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయ్యి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా.? తెలుగులో తోప్ హీరో అతను. యూత్ లో విపరీతమైన కేజ్ సొంతం చేసుకున్నాడు ఆ యంగ్ హీరో. ఇంతకూ ఆయన ఎవరో కనిపెట్టారా.? గూతుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటా ఎవరో చెప్పుకోండి చూద్దాం.!

ఎక్కువగా కష్టపడకండి.. అతను ఎవరో కాదు.. యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈనగరానికి ఏమైంది అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు విశ్వక్ సేన్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు విశ్వక్. అలాగే దర్శకుడిగానూ మారి సినిమాలు చేశాడు. ఫలక్ నామ దాస్ సినిమాతో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. అదేవిధంగా అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇటీవలే సక్సెస్ అందుకోలేకపోయాడు విశ్వక్. ఇక ఇప్పుడు ఫంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జాతిరత్నాలు ఫెమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ గతంలో చేసిన షార్ట్ ఫిలింకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..