
మాములుగా మనం పామును చూస్తే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాం.. కొంతమంది మాత్రం దైర్యం చేసి దానిని తరిమే ప్రయత్నం చేస్తారు. పై ఫొటోలో కనిపిస్తున్న పాపను చూశారుగా ఎంతో దైర్యంగా ఆ పామును పట్టుకొని ఫోటోలకు పోజులిచ్చింది. సినిమాలు బాగా చూసే వారు పోలికలు చూసి గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈమె ఓ స్టార్. మల్టీ ట్యాలెంటెడ్ నటిగా తెలుగు నాట బాగా ఫేమస్ ఆమె. నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా, సింగర్‌గా.. ఇలా తన ప్రతిభతో దూసుకుపోతుంది. బడా ఫ్యామిలీ నుంచి వచ్చినా మల్టీ ట్యాలెంటెడ్ వుమన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. గతంలో లాగా ప్రస్తుతం ఈమె సినిమాలు చేయడం బాగా తగ్గించింది. అయినా వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం ఆమె చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలే. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తన గొప్ప మనసును చాటుకుంది.
ఏకంగా 500 పాఠశాలలను దత్తత తీసుకుని పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోంది. మరి ధైర్యంతో పాటు అందమైన మనసున్న ఈ టాలీవుడ్ తారను గుర్తుపట్టారా? లేదా? మమ్మల్నే చెప్పేయమంటారా? ఆమె మరెవరో కాదు.. ప్రముఖ నటి మంచు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మీ చిన్ననాటి ,అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పైన ఉన్న ఫొటో అందులోదే.
అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. మొదటి సినిమాతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అంతకుముందు కొన్ని ఇంగ్లిష్ సీరియల్స్, టీవీషోస్ లోనూ సందడి చేసింది. దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట, గుంటూర్ టాకీస్, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్, మా వింత గాథ వినుమా, పిట్ట కథలు, మాన్‌స్టర్ (మలయాళం) వంటి సినిమాల్లో నటిగా మెప్పించింది మంచులక్ష్మి. ఇటీవలే దక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు హిట్ సినిమాలను నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. గతంలో లాగా ఇప్పుడు సినిమాలు చేయకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తోంది మంచు లక్ష్మి. కొన్ని నెలల క్రితం 500 పాఠశాలలను దత్తత తీసుకుని తన మంచి మనసును చాటుకుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.