Toxic Movie : ఏందీ మావ.. టాక్సిక్ డైరెక్టర్ ఒకప్పుడు తెలుగు హీరోయినా.. ? ఏ సినిమా చేసిందంటే..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్, టీజర్ ఏ రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యాయో చెప్పక్కర్లేదు.

Toxic Movie : ఏందీ మావ.. టాక్సిక్ డైరెక్టర్ ఒకప్పుడు తెలుగు హీరోయినా.. ? ఏ సినిమా చేసిందంటే..
Geetu Mohandas

Updated on: Feb 26, 2026 | 3:33 PM

ప్రస్తుతం కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్, టీజర్ ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే డైరెక్టర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. టీజర్ చూసి డైరెక్టర్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ బాలనటిగా తెరంగేట్రం చేసింది. 1981 జూన్ 8న కేరళలోని కొచ్చిలో జన్మించిన ఆమె.. 1986లో వచ్చిన ఓన్ను ముతల్ పూజ్యం వారే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగ ప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత కథానాయికగా మారింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నా ఆమె.. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

2004లో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డ్ అందుకున్నారు. నటిగా కొనసాగుతున్న సమయంలోనే దర్శకత్వం వైపు మళ్లింది. 2009లో కేల్కున్నుండో అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా దర్శకురాలిగా మారింది. లయర్స్ డైస్ సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. అంతేకాదు ఈ సినిమా ద్వారా అకడామీ అవార్డులకు అధికారిక ఎంట్రీగా నిలవడం విశేషం. తర్వాత నివిన్ పౌలీతో రూపొందించిన మూతోన్ చిత్రంతో మరో సక్సెస్ అందుకుంది. మలయాళం, తమిళ భాషలలో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించింది.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

ఇదిలా ఉంటే.. నటిగా, దర్శకురాలిగా మెప్పించిన గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గానూ నటించిందన్న విషయం మీకు తెలుసా.. ? దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన వీడెక్కడి మొగుడండీ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్. వేణు తొట్టెంపూడి, శ్రుతి రాజ్ జంటగా నటించిన సినిమాలో శృతి రాజ్ చెల్లెలిగా కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఆమె తెలుగులో సినిమా చేయలేదు. ఇప్పుడు దర్శకురాలిగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us