AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు భర్తల చేతిలో నరకం చూసిన తెలుగు హీరోయిన్.. చివరి రోజుల్లో ఇలా

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక అందాల తార.. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా 300సినిమాల్లో నటించి అలరించింది ఆ అందాల తార. కాగా ఆమె నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అలాగే ఇద్దరు భర్తలతో విడిపోయి ఒంటరి జీవితం గడిపింది.

ఇద్దరు భర్తల చేతిలో నరకం చూసిన తెలుగు హీరోయిన్.. చివరి రోజుల్లో ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 23, 2026 | 10:39 AM

Share

సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్స్ ప్రేక్షకుల మనస్సులో చరగాని ముద్ర వేశారు. కొంతమంది హీరోయిన్స్ సినిమాలతోనే కాదు.. వ్యక్తిగత విషయాల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా చాలా ఫెమస్. 300కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఆమె తోప్ హీరోయిన్.. ఎంతో మంది స్టార్ హీరోల సరేనా నటించి మెప్పించింది. అయితే స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ అందాల భామ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఆమె మరెవరో కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి, సీనియర్ నటి రాజసులోచన. ఇండియన్ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు ఆమె. 1934 ఆగష్టు 15న విజయవాడలో భక్తవత్సలం నాయుడు, దేవిక దంపతులకు జన్మించిన రాజసులోచన బాల్యం మద్రాసులో గడిచింది. ఆమె అసలు పేరు రాజీవలోచన కాగా, స్కూల్లో పొరపాటున రాజసులోచనగా నమోదు కావడంతో అదే పేరు స్థిరపడింది. చిన్నతనం నుంచే నృత్యంపై అపారమైన ఆసక్తిని పెంచుకున్న రాజసులోచన, ఏడేళ్ల వయసులో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టినా, ఆమె దృష్టి ఎక్కువగా నృత్యం పైనే ఉండేది. తన మేనమామ స్థాపించిన సుగుణ విలాస సభ నాటక, నృత్య ప్రదర్శనలు ఆమెకు ఎంతో ప్రేరణనిచ్చాయి. తన 13వ ఏటే స్టేజీపై తొలిసారి అరంగేట్రం చేశారు.  తల్లిదండ్రుల అంగీకారం లేకపోయినా, 1951 సెప్టెంబర్ 11న కరుణానిధి సమక్షంలో పరమశివంతో ఆమె వివాహం జరిగింది. పెళ్లికి ముందే గుణసాగరి చిత్రంలో ఓ నృత్య సన్నివేశంలో పాల్గొన్నప్పటికీ, ఆ చిత్రం ఆలస్యంగా విడుదలైంది.

మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే

1952లో కె.ఎస్. ప్రకాశరావు తన కన్నతల్లి చిత్రంలో ఆమెకు నటిగా అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో కూచిపూడి యక్షగానంలో నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తితో కలిసి నటించారు. వివాహం జరిగిన ఏడాదికి శ్యామ్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. కెరీర్ ప్రారంభంలో రాజసులోచన తెలుగు, తమిళ చిత్రాల్లో వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ, ఎన్టీఆర్ నటించిన సొంతవూరు చిత్రంతో హీరోయిన్‌గా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత మాంగల్య బలం, రాజమకుటం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్రతారగా ఎదిగారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, ప్రేమ్ నజీర్, రాజ్‌కుమార్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు.

ఇవి కూడా చదవండి

ఆ సినిమా వల్ల అవకాశాలు చాలా తగ్గాయి.. అలాంటి పాత్రలే చేస్తా అనుకున్నారు: సత్య కృష్ణ

మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు చిత్రానికి నృత్య దర్శకత్వం కూడా వహించారు. వృత్తి జీవితం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, రాజసులోచన వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. భర్త పరమశివం వేధింపులు భరించలేక, ఆయనకు విడాకులిచ్చి, కుమారుడు శ్యామ్‌తో ఒంటరిగా జీవనం సాగించారు. ఈ కష్టకాలంలో దర్శకుడు సి.ఎస్.రావులోని మంచితనాన్ని గమనించి ఆయనకు దగ్గరయ్యారు. సి.ఎస్.రావు అప్పటికే వివాహితుడై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, రాజసులోచనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1963 మేలో గురువాయూర్‌లో వారి వివాహం జరిగింది. 1966 జూలై 27న ఈ దంపతులకు కవల పిల్లలు శ్రీ గురుమూర్తి దేవి, దేవికృష్ణ జన్మించారు. అయితే సి.ఎస్.రావుతో ఆమె వైవాహిక జీవితం పిల్లలు ఎదిగిన తర్వాత అభిప్రాయ భేదాలతో ముగియడం ఆమె జీవితంలో మరో దురదృష్టకరం. తన జీవితంలో అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న రాజసులోచన 2013 మార్చి 5న తుది శ్వాస విడిచారు.

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో స్టార్ క్రికెటర్ భార్య..? ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?
ఒంట్లో విటమిన్ డి తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర