ఏంటి అమ్మడూ ఆ స్పీడ్..! ఫ్లాప్ కొట్టిన తగ్గని క్రేజ్.. ఏకంగా 9 సినిమాలు లైనప్
యంగ్ హీరోయిన్ జోరు పెంచారు. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోయిన్ ఒకటి రెండు సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా 9 సినిమాలను లైనప్ చేసి అందరూ షాక్ అయ్యేలా చేసింది .

కొంత ముద్దుగుమ్మలకు అదృష్టం వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంటారు. మరికొంతమంది హిట్స్ లేకపోయినా కూడా అవకాశాలు మాత్రం అందుకుంటుంటారు. మరికొంతమంది మాత్రం బ్యాక్ టు బ్యాక్ బడా హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది సినిమాలకు చిన్న గ్యాప్ తీసుకున్నా కూడా ఆతర్వాత వరుసగా ఆఫర్స్ వస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ కూడా అదే కోవలోకి వస్తుంది. టాలీవుడ్ లక్కీ హీరోయిన్ ఈ అమ్మడు. చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. దాంతో ఈ భామ పేరు తెగ వినిపిస్తుంది. చివరిగా ఈ బ్యూటీ చేసిన సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో ఏకంగా 9 సినిమాలు ఉన్నాయి. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆమె ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. ఇందులో సెకండ్ హీరోయిన్‍గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంది. చివరిగా ఈ భామ నటించిన డెవిల్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత చిన్న గ్యాప్ తీసుకుంది ఈ అమ్మడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సంయుక్త చేతిలో ఏకంగా 9 సినిమాలు ఉన్నాయి. లేదే ఓరియెంటెడ్ మూవీ బ్లాక్ గోల్డ్, బాలకృష్ణతో ‘అఖండ 2’, పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలోనూ నటిస్తుంది, శర్వానంద్ జోడిగా ‘నారీ నారీ నడుమ మురారీ’ అనే సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘హైందవ’ మూవీ, నిఖిల్‌తో కలిసి ‘స్వయంభు’, లారెన్స్‌తో ‘బెంజ్’ సినిమాలతో పాటు, హిందీలో ‘మహారాణి’ అనే సినిమాలోనూ నటిస్తుంది
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




