రెండుసార్లు ప్రేమలో పడింది.. ఇద్దరు పిల్లలకు తల్లయింది.. అప్పుడు తెలుగులో తోప్.. కానీ ఇప్పుడు ఇలా..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ అగ్ర హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దళపతి, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. మొదటి సినిమాతోనే తెలుగులో బ్లా్క్ బస్టర్ హిట్ అందుకున్న ఈఅమ్మడు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది

రెండుసార్లు ప్రేమలో పడింది.. ఇద్దరు పిల్లలకు తల్లయింది.. అప్పుడు తెలుగులో తోప్.. కానీ ఇప్పుడు ఇలా..
Actress

Updated on: Sep 15, 2025 | 9:56 AM

ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కట్టిపడేసింది ఆ ముద్దుగుమ్మ. అంతే కాదు టాలీవుడ్ ను ఒకానొక సమయంలో ఏలింది ఆమె.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్‌లో ఎన్నో హైట్స్ చూసింది. కానీ ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. అంతే కాదు వ్యక్తిగతంగాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట ఓ వ్యక్తిగా ఘాడంగా ప్రేమించింది. ఆతర్వాత అది కాస్త బ్రేకప్ అయ్యింది. దాంతో డిప్రషన్ లోకి వెళ్ళింది. కోలుకొని తిరిగి సినిమాల్లో రాణించాలనుకుంది. కానీ కుదరలేదు. ఆతర్వాత మరోసారి ప్రేమలో పడింది. కట్ చేస్తే పెళ్ళికి ముందే తల్లయింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండదు. ఆమె ఎవరంటే.. ఒకప్పుడు తన వయ్యారంతో కుర్రాళ్ళలు కిర్రెక్కిలా చేసిన ఆ  బ్యూటీ ఎవరో కాదు..

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

గోవా ముద్దుగుమ్మ ఇలియానా . తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళం, హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. 2006లో ‘దేవదాసు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా దశాబ్ద కాలంగా వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి తెలుగు స్టార్లతో ఇలియానా స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇలియానా తనకు బాగా డిమాండ్ ఉన్న సమయంలో హఠాత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంది. కట్ చేస్తే బాలీవుడ్ లో సినిమాలు చేసింది. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. ఆతర్వాత ఓ ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది.

ఇవి కూడా చదవండి

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

కొంతకాలం రిలేషన్ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత డిప్రషన్ లోకి వెళ్ళింది. అదే సమయంలో  ఊహించని విధంగా బరువు పెరిగింది. ఆతర్వాత  కోలుకొని తిరిగి సినిమాలు చేయాలనుకుంది. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు తిరిగి సన్నజాజిలా మారింది. ఫ్రెష్ గా మరోసారి ప్రేమలో పడింది. ఈసారి పెళ్లి కాకుండానే తల్లయింది. ఇటీవలే రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తుంది ఇలియానా. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోసారి కేవలం బిడ్డ కాదు మరో ఇద్దరు చిన్నపిల్లల బాధ్యత నాదే. ఆ టైంలో మెంటల్ గా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ సమయంలో నేను మానసికంగా చాలా ఇబ్బందిపడ్డా.. చాలా కష్టంగా ఫీల్ అయ్యా అని చెప్పుకొచ్చింది ఇలియానా..

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.