చిన్న వయసులోనే పెళ్లి.. ఏడాదికే తల్లయ్యింది..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

చిన్నవయసులో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అంతే కొంతమంది హీరోయిన్స్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. 16ఏళ్లకే పెళ్లి చేసుకొని 17ఏళ్లకే తల్లయ్యింది ఈ ముద్దుగుమ్మ.

చిన్న వయసులోనే పెళ్లి.. ఏడాదికే తల్లయ్యింది..! కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్
Actress

Updated on: Feb 22, 2026 | 12:56 PM

ఎంతో మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత హీరోయిన్స్ గా మారిన వారు ఉన్నారు. అలాగే కొంతమంది డైరెక్ట్ గా హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అదే కోవకు చెందింది. చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. టీనేజ్‏లోనే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసింది. 16 ఏళ్లకే తోటి నటుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. 17 ఏళ్లకే తల్లిగా ప్రమోషన్ పొందింది. కానీ వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. విడాకుల తర్వాత మరోసారి నటిగా కెరీర్ ప్రారంభించి స్టార్‌గా మారింది. మనదగ్గర స్టార్ అయ్యి ఆ తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరో తెలుసా.?

 ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ డింపుల్ కపాడియా. 1973లో వచ్చిన బాబీ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం 16 సంవత్సరాల వయసులో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది డింపుల్. 17 సంవత్సరాల వయసులో తల్లి, 30 ఏళ్లు నిండకముందే విడాకులు తీసుకుంది. డింపుల్ అరంగేట్రం చేసిన వెంటనే, సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తన భర్త తాను సినిమాలు చేయకుండా మానేయాలని కోరుకున్నాడని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

విడాకుల తర్వాత 25 సంవత్సరాల వయస్సులో ఇద్దరు కుమార్తెలకు ఒంటరి తల్లి అయ్యింది. 12 సంవత్సరాల విరామం తర్వాత డింపుల్ 1985లో సాగర్ సినిమాతో వెండితెరపై తిరిగి కనిపించింది. రుడాలి చిత్రానికి జాతీయ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. 2020లో క్రిస్టోఫర్ నోలన్ నటించిన టెనెట్‌లో నటించింది. ఇప్పటికీ డింపుల్ కపాడియాకు తిరుగులేదు. మొన్నామధ్య డింపుల్ పఠాన్, తూ ఝూతీ మైన్ మక్కర్, తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో చిత్రాల్లో నటించి ఆకట్టుకుంటుంది.

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us