
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రెటీలు, అభిమానులు ఆయనకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని. రామ్ చరణ్ ఒక ‘ఆట కూలీ’ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మొదటి సాంగ్ చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈసాంగ్ లో చరణ్ డాన్స్ తో అదరగోట్టారు. అలాగే జాన్వీ తన అందాలతో కవ్వించింది. పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ సాంగ్..ఇదిలా ఉంటే చికిరి చికిరి.. సాంగ్ లో కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చికిరి చికిరి పాటలో జాన్వీ పక్కన ఫ్రెండ్ రోల్ లో కనిపించిన ఈ చిన్నదనికి కోసం నెటిజన్స్ గాలిస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఆమె పేరు శ్వేతా సలురు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.