AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బో.. ఈ హీరోయిన్ చాలా డేంజర్ గురూ..! మాఫియా డాన్‌తో ఎఫైర్.. డ్రగ్స్ కేస్.. కట్ చేస్తే సన్యాసిని

హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఒకొక్కరూ ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ నడిపిన వారు కూడా ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారల కారణంగా వార్తల్లో నిలిచారు. ఎంతో మంది ప్రేమ , బ్రేకప్, రిలేషన్స్, డేటింగ్స్ ఇలా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ వార్తల్లో నిలిచారు.

అబ్బో.. ఈ హీరోయిన్ చాలా డేంజర్ గురూ..! మాఫియా డాన్‌తో ఎఫైర్.. డ్రగ్స్ కేస్.. కట్ చేస్తే సన్యాసిని
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2026 | 4:35 PM

Share

ఇండస్ట్రీలో సినిమాలు కంటే సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. హీరో, హీరోయిన్స్ ఎఫైర్స్ దగ్గర నుంచి పెళ్లి, విడాకులు ఎపుడూ వార్తల్లో వినిపిస్తుంటాయి. ఇక అందాల భామలు చాలా మంది సినిమాలతో కంటే పర్సనల్ విషయాలతోనే హాట్ టాపిక్ గా మారారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ రూటే సపరేట్. అప్పటిలో ఈ అమ్మడు అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. కుర్రకారు డ్రీమ్ గర్ల్ ఆ ముద్దుగుమ్మ. అప్పటిలో టాప్ లెస్ ఫోజులతో టాప్ లేపేసింది. మ్యాగజైన్ పై టాప్ లెస్ ఫొటోలతో ఇండస్ట్రీని షేక్ చేసింది. అంతే కాదు. ఏకంగా మాఫియా డాన్ తోనే రిలేషన్ పెట్టుకుంది. ఆమె చిన్న హీరోయిన్ కాదు. ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది ఈ అమ్మడు. అయితే ఆ నటి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. కట్ చేస్తే సన్యాసిగా మారి షాక్ ఇచ్చింది.

ఇది కూడా చదివేసేయండి : స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు

ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మాఫియా డాన్ తో ఎఫైర్ పెట్టుకుంది. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.. ఇప్పుడు ఆధ్యాత్మిక బాటలోకి దిగింది. ఆమె మరెవరో కాదు మమతా కులకర్ణి. 90వ దశకంలో తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. బాలీవుడ్ లో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. మొన్నామధ్య ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడతారా.? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇది కూడా చదివేసేయండి : ఇండియాలోనే తోప్ హీరోయిన్.. వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..

గతంలో ఓ ఇంటర్వ్యూలో నటి పలు విషయాలను వెల్లడించింది. దీంతో పాటు డ్రగ్స్ కేసు విషయాలు కూడా మాట్లాడింది.మమతకులకర్ణి మాట్లాడుతూ.. ‘భారతదేశం నుంచి వెళ్లిపోవడానికి అతిపెద్ద కారణం ఆధ్యాత్మికత.. 1996లో నేను ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాను, ఆ సమయంలో నేను గురు గగన్ గిరి మహరాజ్‌ను కలిశాను. ఆయనను  కలిసిన తర్వాత నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది. ‘బాలీవుడ్ నాకు పేరు, సంపదను ఇచ్చిందని నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆదరణ కోల్పోయాను. నేను చాలా సంవత్సరాలు దుబాయ్‌లో ఉన్నాను. 12 ఏళ్లపాటు బ్రహ్మచారిగా ఉన్నాను. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సన్యాసిని. నాకు బాలీవుడ్‌పైనా, దేనిపైనా ఆసక్తి లేదు. మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే వయసు కూడా లేదు అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేసేయండి : తండ్రి స్టార్ క్రికెటర్.. భర్త బడా ప్రొడ్యూసర్..! ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్

Mamta Kulkarni

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us