
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ గా రాణించాలని కోటి ఆశలతో అడుగుపెడతారు.. కొంతమంది వరుసగా అవకాశాలు అందుకొని హీరోయిన్స్ గా మారతారు. మరికొంతమంది మాత్రం కొన్ని సినిమాలకే పరిమితం అవుతుంటారు. కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం వివాదాలతో పాపులర్ అవుతూ ఉంటారు. సినిమాతో కంటే వివాదాలతోనే పాపులర్ అయిన ముద్దుగుమ్మలు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. తన మాజీ భర్త మోసం, దొంగతనం, పరువు నష్టం, ఇతర ఫిర్యాదులను దాఖలు చేయడంతో దేశం వదిలి పారిపోయింది ఆమె .. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతికింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? భర్త తన పై కేసు పెట్టడంతో ఇండియా వదిలి దుబాయ్ పారిపోయింది. అక్కడ డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడింది. చేతిలో డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతికింది. ఆమె ఎవరంటే..
కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న వారిలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ఒకరు. ఈ బాలీవుడ్ అందాల భామ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటుంది. మొన్నామధ్య దుబాయ్‌లో మీడియా కంట పడింది రాఖీ. దాంతో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తాను దుబాయ్‌లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నానని తెలిపింది. ఆమె స్వయంగా మీడియాతో మాట్లాడుతూ.. దుబాయ్‌లో బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా.. అని తెలిపింది. మైసూర్‌కు చెందిన తన మాజీ భర్త ఆదిల్ చేసిన ఫిర్యాదు కారణంగానే ఇలా బ్రతుకుతున్నా అని చెప్పుకొచ్చింది.
రాఖీ సావంత్ మాజీ భర్త మైసూర్‌కు చెందిన ఆదిల్ రాఖీపై మోసం, దొంగతనం, పరువు నష్టం, ఇతర ఫిర్యాదులను దాఖలు చేశారు, రాఖీ సావంత్ భారతదేశానికి వస్తే ఆమెను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అందుకే ఆమె దుబాయ్‌కు పారిపోయింది. గత కొన్ని నెలలుగా అక్కడే నివాసముంటున్నరాఖి.. డబ్బులు లేకపోవడంతో బిచ్చగత్తెలా జీవిస్తున్నా అని తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఎంత సహాయం కోరినా, ఎంతమందిని అడిగినా.. ఫలితం లేదు.. నా జీవితం బిచ్చగత్తెలా మారింది. నాకు భారత చట్టంపై నమ్మకం ఉంది, నేను తిరిగి భారతదేశానికి వెళ్తాను” అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. అలాగే మొన్నామధ్య సీక్రెట్ గా ముంబై వచ్చి ఓ షూటింగ్ లో పాల్గొని తిరిగి దుబాయ్ వెళ్లిపోయిందని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి