ఆయనకు 57 ఆమె 24.. ప్రేమ పుట్టింది, పెళ్లయింది.. కట్ చేస్తే ఏడాదికే..

టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ సినిమాలతో కంటే వివాదాలతో, వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. కొంతమంది ప్రేమ, పెళ్లి, విడాకుల వార్తల్లో ఎక్కువగా పాపులార్ అవుతున్నారు. వయసులో తమకన్నా చిన్నవారిని పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు ఏకంగా తనకన్నా 33ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఆయనకు 57 ఆమె 24.. ప్రేమ పుట్టింది, పెళ్లయింది.. కట్ చేస్తే ఏడాదికే..
Tollywood

Updated on: May 16, 2026 | 5:06 PM

ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ బంధం కుదరకపోతే విడాకులు తీసుకోవడం అనేది ప్రస్తుత కాలంలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. పెళ్లి సమయంలో జీవితాంతం కలిసి ఉంటామని చెప్పేవారే, కొన్ని రోజులకే విడిపోతున్నామని చెబుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో విడాకులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్స్ విడిపోతున్నాం అంటూ అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. నటుడు బబ్లూ పృధ్వీరాజ్ జీవితంలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. తన కొడుకు కంటే చిన్నదైన యువతిని వివాహం చేసుకుని వార్తల్లో నిలిచాడు పృధ్వీరాజ్, ఆతర్వాత విడాకుల వార్తలతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. పృధ్వీరాజ్ తెలుగు, తమిళం, కన్నడ చిత్రసీమల్లో సుపరిచితుడు. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, 1974లో వచ్చిన అమ్మ మనసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

పెళ్లి సినిమాలోని విలన్ పాత్రకు నంది అవార్డు అందుకుని విశేష ప్రజాదరణ పొందారు. పెళ్లాడి చూపిస్తా, ప్రేయసి రావే, దీర్ఘ సుమంగళి భవ, నా మనసిస్తారా, నువ్వు నాకు నచ్చావ్, ఎన్టీఆర్ మహానాయకుడు వంటి అనేక చిత్రాలలో నటించారు. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, యానిమల్ వంటి చిత్రాలు, దయా వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా రెండవ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. పృధ్వీరాజ్ వృత్తి జీవితం ఒకవైపు సాగుతుండగా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు తరచుగా బయటపడుతుంటాయి. 1994లో బీనా అనే మహిళను పృధ్వీరాజ్ వివాహం చేసుకున్నారు. వారికి అహద్ మోహన్ జబ్బర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, వారి దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తి ఆరేళ్లుగా విడిగా జీవించి,ఆతర్వాత విడాకులు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

ఆ తర్వాత పృధ్వీరాజ్, రుక్మిణి శీతల్ అనే తెలుగు అమ్మాయితో పరిచయం, ప్రేమ, వివాహం చకచకా జరిగిపోయాయి. ఆ మధ్య 57 ఏళ్ల పృధ్వీరాజ్, తనకంటే 33 ఏళ్లు చిన్నదైన 24 ఏళ్ల శీతల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వయసు అంతరంపై అప్పట్లో ఇంటర్నెట్‌లో తీవ్ర ట్రోలింగ్ జరిగింది. అయితే, ప్రేమ పుట్టడానికి ఏజ్ లేదు, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్, తను నాకంటే మెచ్యూర్డ్ మైండ్ అంటూ పృధ్వీరాజ్ ట్రోల్స్‌ను కొట్టిపారేశారు. శీతల్ చాలా ధైర్యంగా ఉంటుందని, తామిద్దరం సంతోషంగా ఉన్నామని ఆయన గతంలో చెప్పారు. పెళ్లి చేసుకోవాలని శీతలే మొదట పృధ్వీరాజ్‌ను అప్రోచ్ అయ్యారని, ఆలోచించుకోవాలని చెప్పినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదని పృధ్వీరాజ్ వెల్లడించారు. ఇంతటి ప్రేమతో, ఇష్టంతో వివాహం చేసుకున్న ఈ జంట, పెళ్లైన కేవలం ఏడాదికే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కాగా  శీతల్ ఇప్పుడు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది, పృధ్వీరాజ్ సింగిల్ గా ఉన్నారు.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

పెద్ది సినిమా గురించి బుచ్చిబాబు మాటల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us