మిరాయ్ సినిమాలో శ్రీరాముడిగా ఆ స్టార్ హీరో..? థియటర్స్‌లో గూస్‌బంప్స్ గ్యారెంటీ

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు కుర్ర హీరో తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు తేజ సజ్జ.. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు తేజ. ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు

మిరాయ్ సినిమాలో శ్రీరాముడిగా ఆ స్టార్ హీరో..? థియటర్స్‌లో గూస్‌బంప్స్ గ్యారెంటీ
Mirai

Updated on: Aug 29, 2025 | 10:10 AM

యంగ్ హీరో తేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తేజ ఇప్పుడుహీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి డిఫరెంట్ కథలతో హిట్స్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హనుమాన్ సినిమా ఏకంగా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్ గా మిరాయ్ సినిమా తెరకెక్కుతుంది.

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నాయి. మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా మిరాయ్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశారు. ఈ ట్రైలర్ లో విజువల్స్ ఆడియన్స్ ను పేక్షకులను మెప్పిస్తున్నాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తేజ ఖాతాలో మరో హిట్ పడ్డట్టే అనిపిస్తుంది.

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే 

ఇక ట్రైలర్ లో శ్రీరాముడికి సంబంధించిన కొన్ని షాట్స్ చూపించారు. హీరోకు శ్రీరాముడు సాయం చేసినట్టు ట్రైలర్ లో చూపించారు. అయితే శ్రీరాముడు పాత్ర చేసింది ఎవరు అంటూ ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే రాముడి పాత్రను ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(AI )తో క్రియేట్ చేశారని తెలుస్తుంది. కొంతమంది మాత్రం రాముడి పాత్రలో ఓ స్టార్ హీరో నటించాడు అని కొంతమంది అంటున్నారు. బాలీవుడ్ నటుడిని రాముడు పాత్ర కోసం తీసుకొచ్చారు అని అంటున్నారు. హనుమన్ సినిమాలో ఎలా అయితే ఆంజనేయుడిని చూపించి చూపించకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్నారో.. మిరాయ్ లోనూ రాముడిని అలానే చూపించారు. మరి రాముడి పాత్రలో నిజంగానే స్టార్ హీరో నటిస్తున్నాడా..? లేక ఆర్టిఫిషల్ ఇంటలిజెన్సా అన్నది సినిమాలో చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.