Tollywood: అప్పుడేమో నవ్వుల క్యూటీ.. ఇప్పుడేమో నడుమందాల హాటీ.. ఎవరో గుర్తుపట్టారా.?

|

Sep 11, 2024 | 6:50 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది. అందం, అమాయకమైన నటనతో కుర్రకారును కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత మాత్రం క్రేజ్ కాపాడుకోలేకపోయింది. ఆ వివరాలు ఇలా..

Tollywood: అప్పుడేమో నవ్వుల క్యూటీ.. ఇప్పుడేమో నడుమందాల హాటీ.. ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది. అందం, అమాయకమైన నటనతో కుర్రకారును కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత మాత్రం క్రేజ్ కాపాడుకోలేకపోయింది. దీంతో తెలుగులో చిన్న సినిమాలు, సెకండ్ హీరోయిన్ రోల్స్ పోషించి మెప్పించింది. కానీ కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు, కంటెంట్ ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఓవైపు ఈ బ్యూటీ నటించిన సినిమాలు వివాదాస్పదమవుతున్నా.. ఏమాత్రం వెనకడుకు వేయకుండా వరుస సినిమాలతో అలరిస్తుంది. ఇంతకీ ఆ క్యూట్ చిన్నారి ఎవరనుకుంటున్నారు.. తనే హీరోయిన్ ఆదా శర్మ.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

ఇవి కూడా చదవండి

ఆదా శర్మ.. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నితిన్ కాంబోలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ ఆదాకు మాత్రం మొదటి సినిమాతోనే భారీ క్రేజ్ వచ్చేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంటుంది అనుకున్నారంతా. కానీ ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన ఆదా శర్మ.. 2008లో బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. 1920 సినిమాతో నార్త్ అడియన్స్ ప్రశంసలు అందుకుంది.

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

ఆ తర్వాత ‘హసీ తో ఫేసీ’, ‘కమాండో 2’ , ‘హమ్ హై రహీ కర్ కే’లో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ చిత్రం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. ఈ సినిమాలో ఆదా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తున్న ఆదా.. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి